Team India : టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. మూడో వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. వైజాగ్ గడ్డపై ఓపెనర్ యశస్వీ జైస్వాల్(116 నాటౌట్) అజేయ శతకంతో కదంతొక్కగా.. రోహిత్ శర్మ(75), విరాట్ కోహ్లీ(65 నాటౌట్) మరో క్లాస్ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ప్రత్యర్ధి నిర్దేశించిన 271 పరుగుల ఛేదనలో టాపార్డర్ దంచేయడంతో టీమిండియా 9 వికెట్లతో సఫారీలను మట్టికరిపించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత టీమిండియా స్వదేశంలో తొలి వన్డే సిరీస్ పట్టేసింది. టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన భారత జట్టు వన్డే సిరీస్‌లో తడాఖా చూపించింది. సిరీస్ ఫలితాన్ని నిర్ణయించే వైజాగ్ వన్డేలో అత్యుత్తమ ఆటతో సఫారీలకు చెక్ పెట్టింది రాహుల్ సేన. ఈ ఫార్మాట్లో శతకంతో మెరిసిన యశస్వీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికవ్వగా.. రెండు సెంచరీలు, ఒక ఫిఫ్టీ బాదిన కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
A match-winning effort! 👌
For his fantastic unbeaten 1⃣1⃣6⃣, Yashasvi Jaiswal is adjudged the Player of the Match in Vizag 👏
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @ybj_19 pic.twitter.com/QMvzQazAHG
— BCCI (@BCCI) December 6, 2025
రెండేళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ తర్వాత తొలిసారి టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకుని ప్రత్యర్థిని 270కే కట్టడి చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(116 నాటౌట్), రోహిత్ శర్మ(75) పవర్ ప్లేలో వికెట్ పడకుండా ఆడారు. యశస్వీ కాస్త ఆచితూచి ఆడగా.. రోహిత్ తనదైన ఫుల్షాట్లతో రెచ్చిపోయాడు. ఈ ద్వయం.. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యంతో టీమిండియాను గెలుపు దిశగా నడిపింది. అయితే.. 61వ హాఫ్ సెంచరీ తర్వాత శతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను మహరాజ్ వెనక్కి పంపాడు. దాంతో.. తొలి వికెట్ పార్ట్నర్షిప్ 155 పరుగులకు తెరపడింది.
Virat Kohli wraps the chase in style! 👌👌
A commanding 9⃣-wicket victory in Vizag 🔥
With that, #TeamIndia clinch the ODI series by 2⃣-1⃣
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/tgxKHGpB3O
— BCCI (@BCCI) December 6, 2025
పవర్ ప్లే తర్వాత దంచేసిన రోహిత్ ఔటయ్యేసరికి భారత్ స్కోర్.. 155. అప్పటికి మ్యాచ్ టీమిండియా చేతుల్లోనే ఉంది. అనంతరం క్రీజులోకి వచ్చిన శతకాల వీరుడు విరాట్ కోహ్లీ(65 నాటౌట్) తనదైన స్టయిల్లో చెలరేగాడు. యాన్సెన్ ఓవర్లో బౌండరీతో తన విధ్వంసానికి తెరతీసిన విరాట్.. బాష్‌కు చుక్కలు చూపిస్తూ 34 ఓవర్లో 4, 6 బాదాడు. కాసేపటికే సింగిల్‌తో యశస్వీ వన్డేల్లో తొలి సెంచరీ సంబురాలు చేసుకున్నాడు. ఆ తర్వాత గేర్ మార్చిన కోహ్లీ ఫోర్లతో హోరెత్తించాడు. పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన బార్ట్‌మన్‌ను టార్గెట్ చేసిన రన్ మెషీన్ అతడి ఓవర్లో బౌండరీతో 76వ అర్ధ శతకం సాధించాడు. ఆ తర్వాత బంతిని సిక్సర్‌గా మలిచిన అతడు.. ఎంగిడి వేసిన 40 వ ఓవర్లో మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించాడు. విరాట్, యశస్వీ అజేయంగా నిలవగా 9 వికెట్లతో సఫారీలను ఓడించిన టీమిండియా.. 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
📸📸 A special ton followed by a special celebration 💯
Well played Yashasvi Jaiswal 👏👏
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/W7Ob6LxV3r
— BCCI (@BCCI) December 6, 2025
రాయ్‌పూర్ వన్డేలో తేలిపోయిన భారత బౌలర్లు వైజాగ్‌లో చెలరేగారు. సిరీస్ విజేతను నిర్ణయించే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా హిట్టర్ల జోరుకు కళ్లెం వేశారు. ప్రసిధ్ కృష్ణ(4-66) టాపార్డర్‌ను దెబ్బకొట్టగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్(4-41) మిడిలార్డర్‌ను పడగొట్టి సఫారీలకు షాకిచ్చాడు. ఒకే ఓవర్లో డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(29), మార్కో యాన్సెన్(17)లను ఔట్ చేసి భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు కుల్దీప్. ఓపెనర్ క్వింటన్ డికాక్(106) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ తెంబా బవుమా(48) రాణించగా ప్రొటీస్ టీమ్ 270కి ఆలౌటయ్యింది.
South Africa are all out for 2⃣7⃣0⃣ in Vizag
Prasidh Krishna with the final wicket of the innings 😎
He finishes with a four-wicket haul 🙌
Scorecard ▶️ https://t.co/HM6zm9o7bm#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/5mays2y5uS
— BCCI (@BCCI) December 6, 2025