హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్రంలో ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో త్వరలో మొదలుకానున్న తెలంంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్)కు సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) సహకరించాలని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు కోరారు.
బుధవారం స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్తో హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి సహకరించాలని ఎస్ఆర్హెచ్కు జగన్ విజ్ఞప్తి చేశారు. ఐపీఎల్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఉప్పల్ మల్టి లెవల్ పార్కింగ్ సౌకర్యానికి సహకారం అందించాలన్నారు.