Jacob Oram| ఆక్లాండ్: ఈ ఏడాది అక్టోబర్‌లో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చాడు. ఆ దేశ మాజీ పేసర్ జాకబ్ ఓరమ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరుకోవడానికి న్యూజిలాండ్‌కు భారత పర్యటన కీలకం కాగా ఓరమ్ వంటి మాజీ పేసర్ అనుభవం కివీస్‌కు పనికొస్తుందని ఆ జట్టు భావిస్తోంది. 11 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో ఓరమ్.. 33 టెస్టులు, 160 వన్డేలు, 36 టీ20లు ఆడి 250 వికెట్లు పడగొట్టాడు.