Jack Leach : ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach) మరికొన్ని రోజులు ఆటకు దూరం కానున్నాడు. ఎడమ మోకాలి గాయం (Knee Injury) కారణంగా భారత పర్యటన నుంచి అర్థాంతరంగా వైదొలిగిన లీచ్ స్వదేశంలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఈ విషయాన్ని లీచ్ స్వయంగా వెల్లడించాడు. బీబీసీ రేడియో 5 లైవ్‌లో మాట్లాడిన లీచ్ .. ‘నేను ఆపరేషన్ చేయించుకోబోతున్నా. మోకాలి వాపు ఇంకా తగ్గలేదు.
ఈ విషయంలో నేను కొంచెం దురదృష్టవంతుడినే. దాంతో, సర్జరీ భారత్‌తో ఉప్పఅనివార్యమైంది’ అని తెలిపాడు. నిరుడు వెన్నెముక గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన లీచ్.. మరోసారి గాయం కారణంగా ఆటకు దూరమవ్వడం ఇంగ్లండ్ జట్టును కలవరపరుస్తోంది. ఇప్పటివరకూ 36 టెస్టులు ఆడిన లీచ్ 126 వికెట్లు పడగొట్టాడు. అనతికాలంలోనే ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్‌గా ఎదిగిన అతడు ఒకసారి 10, ఐదుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఉప్పల్ ల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో లీచ్ గాయపడ్డాడు. బౌండరీ వద్ద బంతిని ఆపే క్రమంలో అతడి ఎడమ మోకాలికి దెబ్బ తగిలింది. దాంతో, ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రెండో ఇన్నింగ్స్‌లో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేకపోయాడు. మ్యాచ్ అనంతరం విశ్రాంతి తీసుకున్న లీచ్ వైజాగ్ టెస్టుకు దూరమయ్యాడు. అనంతరం జట్టుతో కలిసి అబుదాబీ వెళ్లిన లీచ్ అక్కడి నుంచి నేరుగా ఇంగ్లండ్ విమానం ఎక్కిన విషయం తెలిసిందే.