IND vs ENG 4th Test : రాంచీ టెస్టులో భారత జట్టు మూడో రోజు తొలి సెషన్లోనే ఆలౌటయ్యింది. యంగ్‌స్టర్ ధ్రువ్ జురెల్ (90 : 149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటంతో టీమిండియా 300 స్కోర్ కొట్టింది. మూడో రోజు కూడా జురెల్ పట్టుదలగా ఆడడంతో ఇంగ్లండ్‌కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సెంచరీకి చేరువైన జురెల్ అనూహ్యంగా 90 పరుగుల వద్ద ఔటయ్యాడు.
టామ్ హర్ట్లే బౌలింగ్‌లో బంతిని అంచనా వేయలేక బౌల్డ్ అయ్యాడు. దాంతో, 307 పరుగుల వద్ద టీమిండియా ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ యువ స్పిన్నర్ సోయబ్ బషీర్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఆకాశ్ దీప్()ను ఎల్బీగా ఔ ట్ చేసిన అతడు ఐదో వికెట్ సాధించాడు.
It’s Lunch on Day 3 of the Ranchi Test!
A narrow miss on a maiden Test ton but what a gutsy 90 from Dhurv Jurel! 👍 👍#TeamIndia added 88 runs to their overnight score to post 307 on the board.
Second Session coming up shortly.
Scorecard ▶️ https://t.co/FUbQ3Mhpq9… pic.twitter.com/NTJauz0Y8G
— BCCI (@BCCI) February 25, 2024
ఓవర్‌నైట్ స్కోర్ 219/7 తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. కొంచెం సేపటికే కుల్దీప్ యాదవ్(28) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్(9)తో కలిసి జురెల్ ధనాధన్ ఆడాడు. బషీర్‌ను టార్గెట్ చేసిన అతడు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే.. ఆకాశ్ ఔటైన కాసేపటికే అతడు కూడా పెవిలియన్ చేరాడు. జురెల్ 10 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ విలువైన ఇన్నింగ్స్‌తో జట్టును ఒడ్డునపడేశాడు.
Dhruv Jurel putting up a show here in Ranchi! 👌 👌
He moves into 90 as #TeamIndia sail past 300 👏 👏
Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zYp9At55JX
— BCCI (@BCCI) February 25, 2024
రెండో రోజు ఇంగ్లండ్‌ను 353కే కట్టడి చేసిన భారత్ తడబడింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73; 8 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. శుభ్‌మన గిల్ (38) పర్వాలేదనిపించాడు. రాజ్‌కోట్ టెస్టులో సెంచరీ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ (2), రజత్ పాటిదార్ (17), రవీంద్ర జడేజా (12), సర్ఫరాజ్ ఖాన్ (14), రవిచంద్రన అశ్విన్ (1) విఫలమయ్యారు. ఒకదశలో ఆలౌట్ ప్రమాదంలో పడిన జట్టును జురెల్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.