Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతిచెందారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతిచెందారు. ఆదివారం ఉదయం కాంకేర్ జిల్లాలోలోని కోయలిబేడా అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్స్ (DRG), బీఎస్ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మరణించారని జిల్లా ఎస్పీ ఇందిర కల్యాణ్ చెప్పారు.
ఘటనా స్థలంలో ముగురి మృతదేహాలతోపాటు రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని వెల్లడించారు. కాగా, శనివారం సుక్మా జిల్లాలోని బుర్కలంక అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, డీఆర్జీ జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

