Shreyas Iyer : సిడ్నీ వన్డేలో గాయపడిన భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) వేగంగా కోలుకుంటున్నాడు. అయితే.. అతడు మళ్లీ మైదానంలోకి దిగడానికి సమయం పట్టేలా ఉంది. ఎందుకంటే.. డిసెంబర్ రెండోవారంలో అయ్యర్‌కు స్కానింగ్ నిర్వహించనున్నారు. ఈ స్కాన్ రిపోర్టును బట్టి.. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(CoE)లో టీమిండియా స్టార్ ఎప్పుడు చేరుతాడు? ఎప్పటి నుంచి అతడి రిహాబిలిటేషన్ ప్రారంభం కానుంది అనే విషయంపై స్పష్టత రానుంది.
వన్డేల్లో నాలుగో స్థానంలో స్థిరపడిన అయ్యర్ వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయంలో కీలకమయ్యాడు. వచ్చే ప్రపంచకప్ సన్నాహకాల్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లగా.. అయ్యర్ మూడో మ్యాచ్‌లో అనూహ్యంగా గాయపడ్డాడు. హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత నొప్పితో విలవిలలాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు.
🚨 Shreyas Iyer has suffered ribcage injury but will be back by SA series.
– This guy never cared about himself but the team, always tries to give his all. Has always produced extraordinary moments as a fielder to contribute extra. God bless him❤️🧿pic.twitter.com/ZaHFerqKTw
— Rajiv (@Rajiv1841) October 25, 2025
స్కానింగ్ పరీక్షల్లో అతడి ప్లీహం దెబ్బతిన్నట్టు తేలింది. దాంతో.. సిడ్నీలోనే ఆపరేషన్ చేయించున్న అయ్యర్.. అక్కడే కొన్నిరోజులు ఉండి.. భారత్‌కు తిరిగొచ్చాడు. ఇప్పటికే అయ్యర్ తన ఇంటివద్ద అల్ట్రాసోనోగ్రఫీ చేయించుకున్నాడు. భారత స్టార్ ఆరోగ్యాన్ని పరిశీలించిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పర్దివాలీ అతడు వేగంగా కోలుకుంటున్నాడని చెప్పాడు.
ప్రస్తుతం కోలుకుంటున్న అయ్యర్ ఇటీవల ఐపీఎల్ సహచరుడు శశాంక్ సింగ్ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నాడు. ఈ పార్టీకి పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా సైతం హాజరైంది. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీని పంచుకున్న ప్రీతి.. అయ్యర్ ఆరోగ్యం మెరుగ్గా ఉందని.. వేగంగా కోలుకుంటున్నాడని చెప్పింది.
Living the dream 🇮🇳❤️ pic.twitter.com/HKAgpqiNv5
— Shreyas Iyer (@ShreyasIyer15) March 10, 2025
18వ సీజన్లో పంజాబ్‌ను ఫైనల్ చేర్చిన అయ్యర్.. కప్ కలను మాత్రం నిజం చేయలేకపోయాడు. దాంతో.. ఈసారి ఫ్రాంచైజీకి ట్రోఫీ అందించాలనే పట్టుదలతో ఉన్నాడతడు. గాయం నుంచి కోలుకుంటున్ను అయ్యర్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. అయితే.. న్యూజిలాండ్‌తో సిరీస్‌లోపు అతడు ఫిట్నెస్ సాధించే అవకాశముంది.