Team India Squad : స్వదేశంలో వచ్చే నెలలో జరుగనున్న టీ20 ప్రపంచకప్ సన్నాహక సిరీస్‌కు భారత స్క్వాడ్‌లో కీలక మార్పులు చేశారు సెలెక్టర్లు. తిలక్ వర్మ (Tilak Varma), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) గాయపడిన నేపథ్యంలో వీరి స్థానాన్ని మరో ఇద్దరితో భర్తీ చేశారు. న్యూజిలాండ్‌తో పొట్టి సిరీస్ కోసం శ్రేయాస్ అయ్యర్, మిస్టరీ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌లను తీసుకున్నారు. దాంతో.. వన్డేలకే పరిమితమైన అయ్యర్ మళ్లీ టీ20ల్లో దంచేసేందుకు సిద్ధమవుతున్నాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు ఈసారి ఫేవరెట్‌గా ప్రపంచకప్ బరిలోకి దిగుతోంది. అంతకంటే మందుగా జనవరి 21 నుంచి న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు స్టార్ ఆటగాళ్లు తిలక్ వర్మ సర్జరీ కారణంగా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో దూరమయ్యారు.
దాంతో.. ఐపీఎల్లో హిట్టైన శ్రేయాస్ అయ్యర్, వికట్ల వీరుడు రవి బిష్ణోయ్‌లను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. అయితే.. అయ్యర్‌ను తొలి మూడు మ్యాచ్‌లకు మాత్రమే ఎంపిక చేసినట్టు బీసీసీఐ తెలిపింది. ఇక లెగ్ స్పిన్నర్ బిష్ణోయ్ నిరుడు జనవరిలో చివరి టీ20 ఆడాడు. ఈ యువకెరటం 42 మ్యాచుల్లో 61 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు.
టీమిండియా అప్డేటెడ్ టీ20 స్క్వాడ్ : సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(తొలి మూడు టీ20లకు), హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్(వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రింకూ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్.