Ivory Coast | లాగోస్ (నైజీరియా): అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆఫ్రికా దేశం ఐవరీ కోస్ట్.. ఏడు పరుగులకే ఆలౌట్ అయి అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ సబ్ రీజియన్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో భాగంగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 రన్స్‌కే కుప్పకూలింది.
మొదట బ్యాటింగ్ చేసిన నైజీరియా నిర్ణీత ఓవర్లలో 271/4 పరుగుల భారీ స్కోరు చేసింది.