కోల్‌కతా: భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి గురువారం తన అంతర్జాతీయ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడనున్నాడు. ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రి.. గురువారం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ వేదికగా కువైట్‌తో జరుగబోయే మ్యాచ్‌తో వీడ్కోలు పలుకనున్నాడు. ఛెత్రితో పాటు భారత్‌కూ కువైట్ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది.
ఫిఫా వరల్డ్ కప్ 2026కు అర్హత రౌండ్లు ఆడాలంటే ‘బ్లూ టైగర్స్’కూ ఇదే ఆఖరి అవకాశం. ఫిఫాతో పాటు 2027 ఏఎఫ్సీ ఏషియా కప్ ప్రిలిమినరీ అర్హత పోటీలలో క్వాలిఫై అవడానికీ ఇవాళ్టి మ్యాచ్ కీలకం. దీంతో ఈ మ్యాచ్‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. 19 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌ను ఛెత్రి అద్భుతమైన విజయంతో ముగించాలని భారత ఫుట్‌బాల్ అభిమానులు కోరుకుంటున్నారు.