Italian Open | రోమ్: మహిళల టెన్నిస్ సూపర్ స్టార్లుగా వెలుగొందుతున్న టాప్ సీడ్స్ ఇగా స్వియాటెక్ (పోలండ్), అరీనా సబలెంక (బెలారస్) రెండు వారాల తర్వాత మరోమారు మట్టికోర్టుపై అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇటీవలే మ్యాడ్రిడ్ ఓపెన్ ఫైనల్లో తలపడ్డ ఈ ఇద్దరూ తాజాగా రోమ్ వేదికగా జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్ ఫైనల్స్‌కు దూసుకొచ్చారు. మహిళల సెమీస్‌లో రెండో సీడ్ సబలెంక 7-5, 6-2 తేడాతో డానియల్ కొలిన్స్(అమెరికా)ను ఓడించి తుదిపోరుకు అర్హత సాధించింది. అంతకుముందే స్వియాటెక్ 6-4, 6-3తో కోకో గాఫ్ (అమెరికా)ను ఓడించి ఫైనల్స్‌కు చేరింది. హోరాహోరీగా సాగిన మ్యాడ్రిడ్ ఓపెన్‌లో స్వియాటెక్నే విజయం వరించింది.