మ్యూనిచ్: ప్రతిష్టాత్మక ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్‌రైఫిల్ మిక్స్డ్ టీమ్‌ఈవెంట్‌లో భారత యువ జోడీ ఆర్యబోర్సె, అర్జున్ బబుత పసిడి పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన స్వర్ణ పతక పోరులో ఆర్య, అర్జున్ ద్వయం 17 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా, చైనాకు చెందిన వాంగ్ జెఫీ, షెంగ్ లివాహో జంట 7 పాయింట్లతో రజతం సొంతం చేసుకుంది.
అంతకుముందు జరిగిన అర్హత రౌండ్ పోరులో ఆర్య, అర్జున్ జోడీ 635.2 పాయింట్లతో రెండో స్థానంలో నిలువగా, చైనా షూటర్లు 635.9 పాయింట్లతో అగ్రస్థానంలో ఫైనల్లోకి ప్రవేశించారు. మరోవైపు 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లో మనుభాకర్, ఆదిత్య మల్రా జోడీ 577 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచింది.