డర్హమ్: విశ్వ క్రీడా సంబురం ఒలింపిక్స్ జరుగుతున్న ఈ సమయంలో ఎక్కడ ఏ మెడల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్‌లోనే అనుకుంటున్నారు చాలా మంది. ఈ లిస్ట్‌లో టీమిండియా పేస్‌బౌలర్ ఇషాంత్ శర్మ కూడా చేరాడు. ఆదివారం ఇండియన్ రెజ్లర్ ప్రియా మాలిక్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన విషయం తెలుసు కదా. అయితే ఆమె ఒలింపిక్స్‌లోనే ఆ మెడల్ గెలిచిందనుకొని ఇషాంత్.. తన ట్విటర్లో ఆమెకు కంగ్రాట్స్ చెప్పాడు.
అతనిలాగే ఇంకా చాలా మంది కూడా ప్రియా ఒలింపిక్స్‌లోనే మెడల్ గెలిచిందనుకొని శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. దీంతో ట్విటర్లో #NotOlympics ట్రెండింగ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఇషాంత్.. వెంటనే తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. శనివారం వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ గెలిచిన సందర్భంలోనూ ఇషాంత్ శుభాకాంక్షలు చెప్పాడు.