అనంతపూర్: టీమ్ఇండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ దేశవాళీ సీజన్లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అనంతపూర్ (ఆంధ్రప్రదేశ్) వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ రెండో దశ మ్యాచ్‌లో భాగంగా అతడు సెంచరీతో కదం తొక్కాడు. రెండో మ్యాచ్‌లో అతడు ఇండియా ‘సీ’ తరఫున ఆడుతూ 126 బంతుల్లోనే 14 బౌండరీలు, 3 భారీ సిక్సర్లతో 111 పరుగులు చేశాడు. కిషన్ దూకుడుకు తోడు బాబా ఇంద్రజీత్ (78), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (46 నాటౌట్), సాయి సుదర్శన్ (43) రాణించడంతో తొలి రోజు ఆటముగిసే సమయానికి ‘సీ’ జట్టు 79 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది.
ఇండియా ‘బీ’ బౌలర్ల ధాటికి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న ఇండియా ‘ఏ’కు షామ్స్ ములానీ (88 నాటౌట్) ఆపద్బాంధవుడిగా నిలిచాడు. హర్షిత్ రాణా, విద్వత్ కరియప్ప, అర్ష్‌దీప్‌సింగ్ తలా రెండు వికెట్లు తీయడంతో 93 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ‘ఏ’ జట్టును ములానీ, తనుష్ కొటియన్ (53) ఆదుకున్నారు.