Ishan Kishan : భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan) కెరీర్లో కష్టమైన దశను ఎదుర్కొంటున్నాడు. అఫ్గనిస్థాన్‌తో పొట్టి సిరీస్‌కు సెలెక్టర్లు ఈ డాషింగ్ బ్యాటర్‌ను పక్కనపెట్టేశారు. దాంతో, టీ20 వరల్డ్ కప్(T20 World Cup) జట్టులో చోటు ప్రశ్నార్థకంగా మారింది. అయితే.. ఇంగ్లండ్(Engalnd)తో టెస్టు సిరీస్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఈ యంగ్‌స్టర్‌కు నిరాశే మిగిలింది.
రెండు టెస్టులకు ఎంపిక చేసిన బృందంలో ఇషాన్‌కు చోటు దక్కలేదు. సెలెక్టర్లు తనను పట్టించుకోకపోవడంతో ఈ యువకెరటం మౌన ముద్రలో ఉండిపోయాడు. ఎవరినీ విమర్శించకుండా ప్రశాంతతను సాధన చేస్తూ ధ్యానంలో మునిగిపోయాడు. మెడిటేషన్ చేస్తున్న వీడియోను ఇషాన్ శుక్రవారం ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🏃♂️ pic.twitter.com/XjUfL18Ydc
— Ishan Kishan (@ishankishan51) January 12, 2024
నిరుడు బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీతో ఇషాన్ ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఆ ఇన్నింగ్స్‌తో టీ20ల్లోనే కాకుండా వన్డేల్లోనూ ఇషాన్ భవిష్యత్ స్టార్ అవుతాడంటూ మాజీలు ప్రశంసలు కురిపించారు. అయితే.. యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal), శుభ్‌మన్ గిల్(Shubman Gill) దూసుకురావడంతో ఇషాన్ తనకు ఎంతో ఇష్టమైన ఓపెనింగ్ స్థానం కోల్పోవాల్సి వచ్చింది. వెస్టిండీస్ సిరీస్‌లో వరుసగా నాలుగు హాఫ్ సెంచరీతో ఔరా అనిపించిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఆసియా కప్‌లో డగౌట్‌కే పరిమితమయ్యాడు.
ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్

ఇక ప్రపంచకప్ స్క్వాడ్‌లోనూ ఎంపికైన ఇషాన్ రెండు మ్యాచ్‌లకే బెంచ్ మీదకు వెళ్లాడు. ఈమధ్యే దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలోనే భారత్‌కు వచ్చేశాడు. వన్డే వరల్డ్ కప్‌లో రెండు మ్యాచులే ఆడిన ఇషాన్.. అనంతరం ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడు మ్యాచులే ఆడాడు. అయితే.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా గిల్ విఫలమయ్యాడు. అఫ్గన్‌తో తొలి టీ20లోనూ 28 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో ఓపెనర్‌గా మంచి రికార్డు ఉన్న ఇషాన్‌కు పొట్టి ప్రపంచకప్‌లో చాన్స్ ఇవ్వాలని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.