Duleep Trophy 2024 : ఏడాది తర్వాత రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్న ఇషాన్ కిషన్ (Ishan Kishan) సత్తా చాటాడు. జట్టులో చోటు కోల్పోయిన బాధ.. సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు మిగిలిచ్చిన దుఃఖాన్ని మరిచిపోయేలా దులీప్ ట్రోఫీ (Duleep Trophy 2024)లో వీరవిహారం చేశాడు. ‘ఇండియా సీ’ (India C) తరఫున బరిలోకి దిగిన ఇషాన్ శతకంతో చెలరేగాడు. పరుగుల దాహంతో ఉన్న అతడు ‘ఇండియా బీ’ బౌలర్లను ఉతికేస్తూ సూపర్ సెంచరీ బాదాడు. 14 ఫోర్లు, రెండు సిక్సర్లతో వంద కొట్టేసి ఇండియా సీని పటిష్ట స్థితిలో నిలిపాడు. ఈ మెగా టోర్నీలో అతడికి ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.
నిరుడు బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్ సెంచరీ బాదిన ఇషాన్ కెరీర్లో చాలా కష్టమైన దశను ఎదుర్కొన్నాడు. వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఈ డాషింగ్ బ్యాటర్.. సెలెక్టర్ల తీరు నచ్చక మధ్యలోనే స్వదేశం వచ్చేశాడు. అక్కడితో మొదలైన కష్టాలు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దుతో మరింత పెరిగాయి. బీసీసీఐ ఆదేశించినట్టు రంజీల్లో ఆడనందుకు కాంట్రాక్ట్ కోల్పోయిన ఇషాన్.. ఆ తర్వాత ఎట్టకేలకు దేశవాళీ క్రికెట్ ఆడాడు.
HUNDRED!!
Ishan Kishan slams a 💯 on his return to First-Class cricket. #DuleepTrophy2024 | #CricketTwitter
More Details ➡️ https://t.co/pzWWAxLjVD
📸 B. Jothi Ramalingam pic.twitter.com/pY1wdmK3DF
— Sportstar (@sportstarweb) September 12, 2024
ఆ తర్వాత ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, జట్టులోకి మాత్రం రాలేదు. దాంతో, ఇలా అయితే జట్టులోకి రావడం సాధ్యం కాదని తెలుసుకున్న ఇషాన్ దులీప్ ట్రోఫీలో బ్యాటుకు పని చెప్పాడు. 97/2తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన ఇషాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
దంచికొడుతున్న ఇషాన్ జోరుకు ముకేశ్ తెరదించాడు. 111 పరుగుల వద్ద అతడు ఔటవ్వడంతో ఇండియా బీ బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. విధ్వంసక సెంచరీతో ఇండియా సీని ఆదుకున్న అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ దంచాడంటే మళ్లీ జాతీయ జట్టుకు ఆడడం ఖాయమే అంటున్నారు విశ్లేషకులు