Ireland | అబుదాబి: టెస్టు హోదా సాధించిన ఏడేండ్ల తర్వాత ఐర్లాండ్ తొలి టెస్టు విజయం నమోదు చేసుకుంది. అఫ్గానిస్థాన్‌తో మూడు రోజుల్లో ముగిసిన ఏకైక టెస్టులో ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 263 రన్స్ కొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన అఫ్గాన్ 218 పరుగులు చేయగా.. ఐర్లాండ్ 111 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసిన మార్క్ ఆడైర్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.