హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆసియా హ్యాండ్‌బాల్ క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలకు మూడోరోజైన శుక్రవారం అల్ అరబీ(ఖతార్) 38-19తో టీస్పోర్ట్స్(భారత్)పై అద్భుత విజయం సాధించింది.
మ్యాచ్ మొదలైన మొదటి నిమిషం నుంచే అల్ అరబీ టీమ్ తమదైన ఆధిపత్యం ప్రదర్శించింది. స్టార్ ప్లేయర్ లరిబి 11 గోల్స్‌తో ఆకట్టుకున్నాడు. అంతకుముందు అల్ ఖద్సియా క్లబ్, అల్నూర్ (సౌదీ అరేబియా) మధ్య జరిగిన మ్యాచ్ 29-29తో డ్రాగా ముగిసింది.