ఖార్తూమ్ : సూడాన్ పశ్చిమ కోర్డోఫాలోని అల్-నుహాడ్ పట్టణం వద్ద బంగారు గని కూలిపోవడంతో 67 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో కార్మికులు గల్లంతయ్యారు. అల్-జరా మైన్లో సరైన రక్షణ పరికరాలు లేకపోవడం వల్లే మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది.
ఈ గనిలో ఉన్న సొరంగాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని.. ఒక్కటి కూలిపోయినా దాని పక్కనున్నవి కూలిపోతాయని గని కార్మికుడు అల్-అమీన్ సులేమాన్ చెప్పారు.