సోమవారం 21 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 16:20:51

ఐపీఎల్.. ఎక్కువ‌సార్లు "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌"గా నిలిచిన ఐదుగురు ఆట‌గాళ్లు వీరే

ఐపీఎల్.. ఎక్కువ‌సార్లు

అతిపెద్ద టీ20 కార్నివాల్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పొట్టి క్రికెట్ కోసం కోట్ల మంది అభిమానులు వేయి కండ్ల‌తో ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లో మ్యాచ్-విన్నింగ్ ప్రదర్శనలు వ‌చ్చిన ఆట‌గాళ్లు  కొంత‌మందే ఉంటారు. జ‌ట్టు గెలుపున‌కు ఉత్త‌మ కృషి చేసిన వారికి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్తారు. ఇప్పటివరకు లీగ్ చరిత్రలో 129 మంది ఆటగాళ్లు ఈ అవార్డుల‌ను అందుకున్నారు. అందులో కొంత‌మంది ప్లేయ‌ర్స్ ఎక్కువ సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు అత్య‌ధిక అవార్డులు గెలుచుకున్న ఐదుగురు ఆట‌గాళ్ల గురించి తెలుసుకుందాం. 

1. క్రిస్ గేల్ -21

క్రిస్ గేల్ బ్యాటింగ్ శైలి ప్ర‌త్యేకంగా ఉంటుంది. ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఈ క‌రేబియ‌న్ స్టార్ ఎన్నో ఘ‌న‌త‌ల‌ను సాధించాడు.  టోర్నమెంట్ చరిత్రలో అత్యధికంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను క్రిస్ గేల్ గెలుచుకున్నాడు. 125 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన గేల్ ఇప్ప‌టివ‌ర‌కు 21 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. గేల్ ఆరు సెంచ‌రీలు, 11 అర్థ సెంచ‌రీలు సాధించాడు. మొద‌ట ఆర్‌సీబీ త‌ర‌పున ఆడిన గేల్‌ను 2018లో పంజాబ్ జ‌ట్టు రూ.2కోట్ల‌కు కొనుగోలు చేసుకుంది. 

2. డివీలియ‌ర్స్‌- 20

గేల్ త‌రువాత ఆర్‌సీబీ స్టార్ ప్లేయ‌ర్ ఏబీ డివిలియ‌ర్స్ 20 ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. కానీ జ‌ట్టు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ ట్రోఫీ గెలువ‌లేక‌పోయింది. 142 ఐపీఎల్ ఇన్నింగ్స్ ఆడిన డివిలియ‌ర్స్ ఇప్ప‌టివ‌ర‌కు 20 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు, 16 అర్ధ సెంచరీలు సాధించాడు.  

3. డేవిడ్ వార్న‌ర్ - 17

డివీలియ‌ర్స్ త‌రువాత సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను అందుకున్నాడు. వార్న‌ర్ మొత్తం 126 మ్యాచ్‌లు ఆడాడు.  14 హాఫ్ సెంచ‌రీలు, మూడు సెంచ‌రీలు చేశాడు.  


4. ఎంఎస్ ధోని - 17

ఎంఎస్ ధోని కూడా 17 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ట్రోఫీలను గెలుచుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కోసం ధోని చాలాసార్లు మ్యాచ్ విన్న‌ర్‌గా నిలిచాడు. 170 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ధోని 13 అర్ధ సెంచరీలు కొట్టాడు. 

5. రోహిత్‌శ‌ర్మ‌ - 17

ఐదు ఐపీఎల్ టైటిళ్లతో రోహిత్ శర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు 183 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్.. 17 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఒక సెంచరీ, 14 అర్ధ సెంచరీలు చేశాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo