Mayank Yadav : ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో యువ పేసర్ మయాంక్ యాదవ్ (Mayank Yadav) ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. సంచలన స్పెల్‌తో మేటి బ్యాటర్లను వణికిస్తున్నాడు. 150కి పైగా వేగంతో బౌలింగ్ చేస్తూ లక్నో సూపర్ జెయింట్స్(LSG) తురుపుముక్కగా మారాడు. తొలి సీజన్లోనే ఈ కుర్ర పేసర్ వరుసగా రెండో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పాడు. భారత జట్టుకు ఆడడమే తన లక్ష్యమంటున్న ఈ ‘ఢిల్లీ ఎక్స్‌ప్రెస్’.. తన డ్రీమ్ ఏంటో చెప్పాడు.
‘2019 వరల్డ్ కప్‌లో జోఫ్రా ఆర్చర్(Jofra Archer) వేసిన బంతిని నేను కూడా వేయాలనేది నా కల. బంగ్లాదేశ్త్ జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ విసిరిన బంతి ఆఫ్ స్టంప్‌ను తాకి బౌండరీకి దూసుకెళ్లింది. అప్పుడే అనుకున్నా నేను ఆ బాల్‌ను వేయాలని. ఫాస్ట్ బౌలర్లు ఆఫ్‌స్టంప్ పైభాగాన్ని టార్గెట్ చేయాలని కోచ్‌లు చెప్తుండేవాళ్లు. నాకు అలాంటి బాల్ వేయాలనుంది’ అని మయాంక్ తెలిపాడు. పదిహేడో సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ విసిరిన మయాంక్.. భారత క్రికెట్ జట్టును వేధిస్తున్న నాణ్యమైన పేసర్ కొరతను తీర్చేలా కనిపిస్తున్నాడు.
మయాంక్ యాదవ్, జోఫ్రా ఆర్చర్
అరంగేట్రంలోనే ఈ రైట్ ఆర్మ్ పేసర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై సంచలన ప్రదర్శనతో చేశాడు. ఛేదనలో కీలకమైన శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ వికెట్లు తీసి పంజాబ్ జోరుకు పగ్గాలు వేశాడు. తన వేగం, కచ్చితత్వం ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదంటూ రెండో గేమ్‌లోనూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ తడాఖా చూపించాడు.
PACE IS PACE YAAR….🔥#RCBvLSG #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/629x4dN4uD
— JioCinema (@JioCinema) April 2, 2024
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాపార్డర్ బ్యాటర్లు మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్లను బోల్తా కొట్టించడమే కాదు.. కామెరూన్ గ్రీన్‌ను బౌల్డ్ చేసి లక్నోను గెలుపు వాకిట నిలిపాడు. 3-14 గణాంకాలతో మయాంక్ వరుసగా రెండో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఎగరేసుకుపోయాడు. దాంతో, మయాంక్‌ను టీ20 వరల్డ్ కప్ జట్టులో ఆడించాలనే డిమాండ్లు ఎక్కువయ్యాయి.