చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. చాలా రోజుల తర్వాత టాస్ గెలిచినందుకు కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. ముంబై తరఫున మార్కోస్ జాన్సెన్, క్రిస్ లిన్లు తొలి మ్యాచ్ ఆడనున్నారు.
అటు బెంగళూరు తరఫున కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ సారి హోమ్ స్టేడియం లేకపోవడంతో రెండు టీమ్స్ తటస్థ వేదికైన చెన్నైలో ఆడుతున్నాయి. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుంది. ముగ్గురు ప్లేయర్స్ బెంగళూరు తరఫున అరంగేట్రం చేస్తున్నారు. మ్యాక్స్‌వెల్, జేమీసన్, రిచర్డ్సన్ ఆడుతున్నట్లు కోహ్లి చెప్పాడు. ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ టీమ్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో రజత్ పాటిదార్ అరంగేట్రం చేస్తున్నాడు.
#RCB Captain @imVkohli wins the toss and elects to bowl first against #MumbaiIndians in the season opener of #VIVOIPL 2021.
— IndianPremierLeague (@IPL) April 9, 2021
Follow the game here – https://t.co/9HI54vpf2I #MIvRCB pic.twitter.com/haOAZAEUfx