IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ‘ట్రెండ్ సెట్టర్’గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్(Sun risers Hyderabad) రెండో టైటిల్‌పై గురి పెట్టింది. గత పన్నెండు సీజన్లలో ఏడోసారి ప్లే ఆఫ్స్ బరిలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ ఈసారి కప్పుతోనే తిరిగి రావాలనే కసితో ఉంది. ప్యాట్ కమిన్స్(Pat Cummins) సారథ్యంలో ప్రత్యర్థులను బెంబేలిత్తిస్తున్న హైదరాబాద్ క్వాలిఫయర్ 1 ఫైట్‌కు సిద్ధమవుతోంది. అహ్మదాబాద్‌లో మే 21న టేబుల్ టాపర్ కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)తో ఆరెంజ్ ఆర్మీ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో కోల్‌కతా చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే చాన్స్ ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేసింది.
సన్‌రైజర్స్ జట్టు 2013లో తొలిసారి ‘ప్లే ఆఫ్స్’లో అడుగుపెట్టింది. ఆ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. డేవిడ్ వార్నర్(David Warner) నేతృత్వంలో 2016లో మరోసారి ప్లే ఆఫ్స్ బెర్తు దక్కించుకుంది. అప్పుడు ఎలిమినేటర్‌లో కోల్‌కతాను, క్వాలిఫయర్ 2లో గుజరాత్ లయన్స్‌ను చిత్తు చేసిన హైదరాబాద్.. ఫైనల్లో ఆర్సీబీకి చెక్ పెట్టి తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.
ఐపీఎల్ ట్రోఫీ(2016)తో సన్‌రైజర్స్ ఆటగాళ్లు
ఆ మరుసటి ఏడాది ఎలిమినేటర్‌లో కోల్‌కతా చేతిలో కంగుతిన్న హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. 2018లో ప్లే ఆఫ్స్ చేరినా క్వాలిఫయర్ 1లో చెన్నైదే పైచేయి అయింది. ఇక క్వాలిఫయర్ 2లో కోల్‌కతాను చిత్తు చేసిన సన్‌రైజర్స్ ఫైనల్లో తేలిపోయింది. ధోనీ సారథ్యంలోని సీఎస్కే ధాటికి నిలవలేక ట్రోఫీని చేజార్చుకుంది.
ఇక 2019లో జరిగిన ఎలిమినేటర్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ జయకేతనం ఎగురవేసింది. 2020లోనూ ప్లే ఆఫ్స్ చేరిన సన్‌రైజర్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి ట్రోఫీపై ఆశలు రేపింది. కానీ, క్వాలిఫయర్ 2లో ఢిల్లీ జోరుకు తలొంచి ఇంటిదారి పట్టింది.
పదిహేడో సీజన్లో కమిన్స్ సారథిగా రావడంతో.. ట్రావిస్ హెడ్(Travis Head) ఇన్నింగ్స్ ఆరంభించడం సన్‌రైజర్స్ ఆటనే మార్చేశాయి. ఓపెనింగ్ జోడీ హెడ్, అభిషేక్ శర్మ(Abhishek Sharma)ల విధ్వంసానికి తెగబడుంతుంటే.. మిడిలార్డర్లో హెన్రిచ్ క్లాసెన్, మర్క్రమ్, అబ్దుల్ సమద్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(Nitish Kumr Reddy)లు దంచేస్తున్నారు. దాంతో 20 రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను తిరగరాసింది.
అభిషేక్ శర్మ, హెడ్
అంతేకాదు 200 ప్లస్ కడితే ఆరెంజ్ ఆర్మీ ఛేజింగ్ చేయలేదనే ముద్రను ఆఖరి లీగ్ మ్యాచ్‌తో చెరిపేసకుంది. ఉప్పల్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) నిర్దేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని మరో ఐదు బంతులుండగానే కమిన్స్ సేన ఊదేసింది. టాపార్డర్, మిడిలార్డర్ భీకర ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ క్వాలిఫయర్ 1లో కోల్‌కతాను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లే చాన్స్ ఉంది. టాప్ గేర్‌లో ఉన్న కమిన్స్ బృందం ఇప్పుడు కప్పు కొట్టకుంటే ఐపీఎల్ రికార్డులు బద్ధలు కొట్టి లాభం ఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
Lights. Camera. 𝗤𝘂𝗮𝗹𝗶𝗳𝗶𝗲𝗿 𝟭 🎬🤩
See you on Tuesday, @KKRiders 🙌🏼#IPL2024 pic.twitter.com/7TNdN8zqop
— SunRisers Hyderabad (@SunRisers) May 19, 2024