Tirumala | తిరుమల నడక మార్గంలో చిరుతల సంచారం.. ఆందోళనలో భక్తులు
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా అలిపిరి నడకదారిలోని ఆఖరిమెట్ల వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూసిన వారంతా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి.
Tirumala | తిరుమల శ్రీవారి భక్తులను చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల తిరుమలలో చిరుత సంచరించిన విషయం తెలిసిందే. తాజాగా అలిపిరి నడకదారిలోని ఆఖరిమెట్ల వద్ద రెండు చిరుతలు భక్తులకు కనిపించాయి. వాటిని చూసిన వారంతా కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. చిరుతల జాడను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు.
చిరుతల సంచారం నేపథ్యంలో భద్రతా సిబ్బంది భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు. మరో వైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా.. తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. ఈ ఘటనతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు నడక మార్గంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి.. పలు చిరుతలను బంధించిన విషయం తెలిసిందే. మళ్లీ ఇటీవల చిరుతల సంచారం పెరుగుతుండడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

