Loksabha Elections 2024 | జూన్ 4న కొలువుతీరనున్న విపక్ష కూటమి సర్కార్ : అరవింద్ కేజ్రీవాల్
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయేకు భంగపాటు తప్పదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్డీయేకు భంగపాటు తప్పదని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. జూన్ 4న కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి అధికారం చేపడుతుందని, అందులో ఆప్ భాగస్వామ్య పార్టీగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
విపక్ష కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ సోమవారం దేశ రాజధానిలో ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ఢిల్లీలో తాము పాఠశాలలు, ఆస్పత్రులను మెరుగుపరిచామని చెప్పారు.
శాంతి భద్రతలు మాత్రం దారుణంగా ఉన్నాయని, లెఫ్టినెంట్ జనరల్ కనుసన్నల్లో నడిచే ఢిల్లీ పోలీసులు తమ మాట వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జూన్ 4 తర్వాత ఢిల్లీ పోలీసులు ప్రజల మాటకు తలవంచక తప్పదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
Read More :
Swimming pool | ఓయూలో ప్రారంభమైన స్విమ్మింగ్ పూల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

