ఉస్మానియా యూనివర్సిటీ, మే 20: ఉస్మానియా యూనివర్సిటీలో(Osmania University) ప్రతి వేసవిలో నడిపించే స్విమ్మింగ్‌పూల్‌ను(Swimming pool) ఓయూ అధికారులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. కరోనా అనంతర పరిస్థితుల్లో మూడేళ్ల పాటు విరామం ఇచ్చినట్లు చెప్పారు. గతేడాది స్విమ్మింగ్ పూల్‌ను ప్రారంభించినప్పటికీ, ఈ ఏడాది ప్రారంభంలో జాప్యం జరిగిందని చెప్పారు.
ఈ పూల్‌లో విపరీతమైన రద్దీ ఉంటుందని, అందుకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. స్విమ్మింగ్ పూల్‌కు వచ్చేందుకు ఆసక్తి ఉన్న వారు కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.