IPL Mumbai Vs Punjab | పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్న ముంబై బ్యాటర్లు
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్‌లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన ఏడో ఓవర్లో బ్రీవీస్ ఓ సిక్సర్ కొట్టగా.. ఆ తరువాత వచ్చిన తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేసిన రాహుల్ చాహర్
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్‌లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన ఏడో ఓవర్లో బ్రీవీస్ ఓ సిక్సర్ కొట్టగా.. ఆ తరువాత వచ్చిన తొమ్మిదో ఓవర్ బౌలింగ్ చేసిన రాహుల్ చాహర్ వేసిన బంతులకు ఒక ఫోర్, నాలుగు సిక్సలు బాదాడు. దీంతో ఈ ఒక్క ఓవర్ లోనే 29 పరుగులు రాబట్టాడు.
బ్రివీస్కు తోడుగా తిలక్ వర్మ కూడా లివింగ్ స్టోన్ వేసిన ఎనిమిదో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. వైభవ్ అరోరా వేసిన పదో ఓవర్లో ఓ ఫోర్, సిక్స్ కొట్టాడు. పది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై స్కోరు 105/2 ఉంది. డివాల్డ్ బ్రీవీస్ (45 నాటౌట్), తిలక్ వర్మ (27 నాటౌట్)గా ఉన్నారు.
అంతకు ముందు ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(28) నాలుగో ఓవర్లో కగిసో రబడ వేసిన బంతికి ఔట్ కాగా.. వైభవ్ అరోరా వేసిన అయిదవ ఓవర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్(3) కూడా పెవిలియన్ దారి పట్టాడు.
ఐపీఎల్ 2022 సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఆడుతున్న మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. ముంబైకి 199 పరుగుల బిగ్ టార్గెట్ నిర్దేశించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్లు హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

