IPL | ఢిల్లీ : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మ్యాచ్ల సంఖ్యను మరింత పెంచేందుకు బోర్డు సన్నాహకాలు మొదలు పెట్టింది. 2022 సీజన్ నుంచి 10 జట్లతో 74 మ్యాచ్లను నిర్వహిస్తుండగా.. 2028 నాటికి మ్యాచ్ల సంఖ్యను 94కు పెంచాలని యోచిస్తున్నట్టు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. ప్రస్తుతమున్న మీడియా హక్కుల కాలపరిమితి (2027) ముగిసిన వెంటనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని ఆయన చెప్పాడు.