ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026కు సంబంధించి వేలం ప్రక్రియను డిసెంబర్ రెండో వారంలో నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. అధికారిక తేదీ ఖరారు కానప్పటికీ బోర్డు వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 13-15 మధ్య వేలం ఉండొచ్చని వినికిడి.
నవంబర్ 15 లోగా జట్లు తాము రిటైన్ చేసుకునే, వేలానికి వదిలేసే ఆటగాళ్ల జాబితాను తమకు అందజేయాలని బీసీసీఐ ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలకు సూచించినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.