Virat Kohli | ఐపీఎల్ 2025 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సన్నాహాలు ప్రారంభించాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవనున్నది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగనున్నది. మొదటి మ్యాచ్‌కు ముందు, కోహ్లీ సన్నాహాలు చేసి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. కోహ్లీ నెట్స్‌లో త్రోడౌన్ స్పెషలిస్ట్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ టైటిల్ సాధించడంలో విరాట్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత కొద్దిరోజుల పాటు విరామం తీసుకొని.. ఆలస్యంగా ఆర్సీబీ జట్టుతో చేరాడు. ఆర్సీబీ ఈ సారి రజత్ పాటిదాన్ నాయకత్వంలో ఆడనున్నది. ఫ్రాంచైజీ ఈ సారైనా టైటిల్‌ను సాధించాలన్న కసితో ఉన్నది.
చాంపియన్స్ ట్రోఫీలో విరాట్ ఐదు మ్యాచ్‌ల్లో 54.50 సగటుతో 218 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, మరో హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ దశలోని చివరి మ్యాచ్‌లో తేలిగ్గా అవుట్ అయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ 84 పరుగులు చేసి భారత్‌ను టైటిల్ మ్యాచ్ సాధించడంలోనూ కీలకపాత్ర పోషించాడు. కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. ఈ సారైనా ఆర్సీబీ తరఫున టైటిల్ సాధించాలని విరాట్ కసితో ఉన్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ జట్టును వీడిన నేపథ్యంలో.. కోహ్లీ మరోసారి ఆర్సీబీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడనే చర్చ జరిగింది. అయితే, ఫ్రాంచైజీ రజన్ పాటిదార్‌పై నమ్మకంతో అతనికి అప్పగించింది. 2021లో కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీని వదులుకున్నాడు. విరాట్ సైతం మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించలేదు.
The first look you can’t resist. 🤌🔥
Full reveal drops today at #RCBUnbox! 👀🎬
🎧: Bhau – The Journey of Life BGM pic.twitter.com/f6KCBsclsf
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 17, 2025