IPL 2025 Schedule | ఐపీఎల్ 2025 హంగామా మొదలైంది. క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 22న ఈ సీజన్ మొదలు కానుంది. 65 రోజుల పాటు కొనసాగునున్న ఈ సీజన్లో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ మే 18వ తేదీతో ముగుస్తుంది. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి 25 వరకు జరగుతాయి. మే 25వ తేదీన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌కు కూడా ఇదే వేదిక ఆథిత్యం ఇవ్వనున్నది.
ఈ సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, ఇంతవరకూ ట్రోఫీ గెలవని జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. తొలి మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23వ తేదీనతన సొంత మైదానం ( ఉప్పల్ స్టేడియం)లోనే రాజస్థాన్‌తో తలపడనుంది.
ఐపీఎల్-2025 సీజన్లో గతంలో మాదిరిగానే 10 వేదికల్లో మ్యాచులు జరుగుతాయి. అలాగే, ఈ సారి ఐపీఎల్ మ్యాచులకు ఈ సారి కొత్త వేదికల్లోనూ పలు మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ సారి మ్యాచులు అహ్మదాబాద్, ముంబయి, చెన్నై, బెంగళూరు, లక్నో, ముల్లన్పూర్, ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, హైదరాబాద్, గువాహటి, ధర్మశాలలో జరుగుతాయి. రాజస్థాన్ రాయల్స్ గువాహటిని రెండో హోంగ్రౌండ్‌గా ఎంపిక చేసుకుంది. మార్చి 26, 30 తేదీల్లో ఇక్కడ రెండు మ్యాచులు జరుగనున్నాయి. రాజస్థాన్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచులు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ తన మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనుండగా.. మిగిలిన హోం మ్యాచ్‌లు పంజాబ్‌లోని ముల్లాన్‌పూర్‌లో ఆడనున్నాయి.
IPL 2025 Schedule