IPL 2025 | ఐపీఎల్-2025 మెగావేలం భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.30లక్షల బేస్ ప్రైజ్‌కు అతన్ని తీసుకుంది. వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ అమ్ముడుపోయలేదు. సెకండ్ రౌండ్లో అర్జున్ బేస్ ప్రైజ్‌కే తీసుకుంది. అర్జున్‌ని ముంబయి జట్టు కొనుగోలు చేయడంతో సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. అర్జున్‌ని ముంబయి జట్టు యాజమాన్యం కామన్‌గానే తీసుకుందని సచిన్ అభిమానులు పేర్కొంటున్నారు. అయితే, మరికొందరు ముంబయి ఇండియన్స్ మెంటార్‌గా సచిన్ ఉండడంతో వేలంపై అతని ప్రభావం ఉంటుందని మరికొందరు పేర్కొంటున్నారు. అర్జున్ వరుసగా నాలుగోసారి ముంబయి జట్టులో చేరాడు. ఐపీఎల్లో అతని ప్రయాణం 2021లో మొదలైంది.
ఆ సమయంలో అర్జున్ బేస్‌ప్రైజ్ రూ.20లక్షలు. అయితే, గాయం కారణంగా ఆ సీజన్లో ఆడలేకపోయాడు. అతని స్థానంలో సిమ్రంజిత్ను ముంబయి జట్టులోకి తీసుకుంది. తాజాగా వేలంలో అర్జున్‌ని తీసుకోగా.. సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి. దేవుడి తనయుడు అర్జున్ టెండూల్కర్ వార్షిక పాకెట్ మనీ యోజనలో భాగంగా ముంబయి కొనుగోలు చేసిందని కామెంట్ చేశాడు. ఏ కోడింగ్ నేర్చుకోకుండానే అర్జున్ టెండూల్కర్ ప్రతి సంవత్సరం రూ.30లక్షలు సంపాదిస్తున్నాడని మరో యూజర్ కామెంట్ చేశాడు. 2023 సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో అర్జున్ అరంగేట్రం చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఐపీఎల్ కెరీర్లో తొలి వికెట్ తీశాడు. తొలి వికెట్‌ని భువనేశ్వర్ కుమార్‌ను అర్జున్ అవుట్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ముంబయి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ సీజన్లో అర్జున్ మొత్తం మూడు వికెట్లు తీశాడు.
Arjun Tendulkar sold to Mumbai in God’s son Annual pocket money yojna pic.twitter.com/52iCmvJuBX
— Div🦁 (@div_yumm) November 25, 2024
MI buying Arjun Tendulkar every year is basically Laadla Beta Yojna by Ambanis. #IPLauctions2025
— Roshan Rai (@RoshanKrRaii) November 25, 2024
Arjun Tendulkar spitting facts 😭 pic.twitter.com/CW2SpPbeMi
— UmdarTamker (@UmdarTamker) November 26, 2024
Arjun Tendulkar earning
30LPA every year without learning any coding #IPLAuction— JT. (@kaapi_kudka) November 25, 2024