Harbhajan Singh | ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 అట్టహాసంగా మొదలైంది. టీ20 క్రికెట్ సమరం మొదలైన కొద్దిగంటల్లోనే వివాదంలో చిక్కుకున్నది. ఐపీఎల్ కామెంటరీ ప్యానెల్లో సభ్యుడిగా భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ చుట్టూ వివాదాలు అలుముకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా భజ్జీ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్‌పై హర్భజన్ సింగ్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లుగా పలువురు ఆరోపించారు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో కామెంటరీ చెబుతూ.. ఇంగ్లాండ్, రాజస్థాన్ రాయల్స్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వివరిస్తూ.. ‘బ్లాక్ టాక్సీ’ అనే పదాన్ని ఉపయోగించాడు.
Racism at Peak 😂😂😂😂
Harbhajan Singh Calling Archer Kali Taxi pic.twitter.com/ijdEqFgNbX— B I S W A J E E T (@Biswajeet_2277) March 23, 2025
ఈ కామెంట్స్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుర్పించారు. హర్భజన్ క్రికెట్ ఆడుతున్న సమయంలోనూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. తాజాగా మరోసారి హర్భజన్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ఆర్చర్ 76 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్‌ను తీయలేకపోయాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న హర్భజన్ సింగ్ .. ‘లండన్‌లో నల్ల ట్యాక్సీల మీటర్ చాలా వేగంగా తిరుగుతుంది. ఇక్కడ ఆర్చర్ మీటర్ కూడా అలాగే ఉంది’ అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్స్ మండిపడుతున్నారు.
𝗛𝗮𝗿𝗯𝗵𝗮𝗷𝗮𝗻 𝗠𝗨𝗦𝗧 𝗔𝗽𝗼𝗹𝗼𝗴𝗶𝘇𝗲:
He called Jofra Archer a “black London taxi” during live commentary During IPL.
Shame Shame Shame#HarbhajanSingh #JofraArcher #IPL2025 #RRvsSRH #CSKvsMI pic.twitter.com/zNPlVeBfgN— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) March 23, 2025
వెంటనే క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. అతన్ని ఐపీఎల్ నుంచి బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, ఆరోపణలపై టర్బోనేటర్ ఇంకా స్పందించలేదు. అయితే, హర్భజన్‌కు పలువురు మద్దతు ప్రకటించారు. జాత్యహంకార వ్యాఖ్యలు చేయలేదని.. ఐపీఎల్లో ఆర్చర్ సైతం ఖరీదైన ఆటగాడని.. నాలుగు ఓవర్లలో 76 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయలేదని.. మాజీ ఆఫ్‌స్పిన్నర్ వ్యాఖ్యల్లో ఉద్దేశం ఇదేనని పలువురు పేర్కొన్నారు. హైదరాబాద్-రాజస్థాన్ మధ్య జరిగిన ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 286 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ రాణించడంతో ఐపీఎల్ హిస్టరీలో ఇది రెండో అత్యధిక స్కోరు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ ఆరు వికెట్ల నష్టానికి 242 పరుగులు మాత్రమే చేయగలిగింది.