GT vs RR | ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కాసేపట్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ను ఎంచుకుంది. కాగా, ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట గెలిచి.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ విషయానికొస్తే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింట గెలిచి.. ఏడో స్థానంలో ఉంది.
రాజస్థాన్ తుది జట్టు :
యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, నితీశ్ రాణా, రియాన్ పరాగ్, హిట్మయిర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహీశ్ తీక్షణ, ఫజల్ హక్ ఫారూఖీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే
గుజరాత్ తుది జట్టు :
సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ రూథర్‌ఫర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ