హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : 25వ బ్యాచ్‌కు చెందిన 76 పోలీసు జాగిలాలు విధుల్లో చేరనున్నాయి. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తిచేసుకున్న ఈ జాగిలాలు మంగళవారం నిర్వహించనున్న పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొననున్నాయి.
వీటితోపాటు 76 మంది ప్రధాన హ్యాండ్లర్లు, 29 మంది స్పేర్ హ్యాండ్లర్లు కలిపి మొత్తం 105 మంది సిబ్బంది శిక్షణ పొందారు.