GT vs RR | ఐపీఎల్ 2025లో భాగంగా రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. శుభ్‌మన్ గిల్ (2) విఫలమైన వేళ.. సాయి సుదర్శన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు. జోస్ బట్లర్, షారుక్‌ఖాన్ అతనికి అండగా నిలిచి జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రాజస్థాన్ ముందు 218 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్‌ను ఆరంభం నుంచే కట్టడి చేయాలని రాజస్థాన్ భావించింది. మూడో ఓవర్లోనే తొలి వికెట్‌ను తీసింది. 2.1 ఓవర్లో జోఫ్రా ఆర్చర్ వేసిన బంతికి శుభమన్ గిల్(2) బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జోస్ బట్లర్ (36)తో కలిసి సాయి సుదర్శన్ (82) చెలరేగాడు. జట్టును భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లాడు. అయితే ఈ విజృంభణకు10వ ఓవర్లో బ్రేక్ పడింది. ఆ ఓవర్లో చివరి బంతికి బట్లర్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తొలుత ఎంపైర్ దీన్ని ఔట్‌గా ప్రకటించలేదు. రాజస్థాన్ రాయల్స్ రివ్యూ కోరడంతో థర్డ్ ఎంపైర్ ఔట్‌గా నిర్ణయించింది. బట్లర్ తర్వాత క్రీజులోకి వచ్చిన షారుక్‌ఖాన్ కూడా దూకుడగా ఆడాడు. 20 బంతుల్లో 36 పరుగులు చేశాడు. కానీ తీక్షణ బౌలింగ్‌లో 15.4 బంతికి షారుక్ ఖాన్ స్టంపౌట్ అయ్యాడు.
షారుక్ ఖాన్ తర్వాత వచ్చిన రూథర్‌ఫోర్డ్(7) వచ్చి రాగానే సిక్స్‌తో విరుచుకుపడ్డాడు. కానీ ఆ దూకుడు ఎక్కువసేపు కొనసాగించలేకపోయాడు. 16.1వ ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్‌లో వికెట్ కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఇక 19వ ఓవర్లో రెండో బంతికి సాయి సుదర్శన్ కూడా ఔటయ్యాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన బంతికి శాంసన్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే రషీద్ ఖాన్ (12) కూడా ఔటయ్యాడు. రాహుల్ తెవాటియా (24) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20ఓవర్లు ముగిసేసరికి ఆరు వికెట్ల నష్టానికి గుజరాత్ 217 పరుగులు చేసింది.