Jasprit Bumrah | ఐపీఎల్లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌కు ముందు ముంబయి ఇండియన్‌కు ఊరట కలిగించేలా శుభవార్త అందింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో బౌలింగ్ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే, బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. వెన్ను నొప్పి కారణంగా బుమ్రా ఈ ఏడాది జనవరి నుంచి క్రికెట్‌కు దూరమైన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరిదైన ఐదో టెస్టు ఆడాడు. కేవలం తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే బౌలింగ్ చేశాడు. బుమ్రాను చాంపియన్స్ ట్రోఫీకి సైతం ఎంపిక చేశారు. అప్పటి వరకు కోలుకోకపోవడంతో మిస్టరీ బౌలర్ స్థానంలో హర్షిత్ రాణాకు అవకాశం అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతున్నా.. ముంబయి జట్టుతో చేరలేదు. పూర్తిస్థాయిలో కోలుకుంటేనే మైదానంలోకి తిరిగి వచ్చే అవకాశం ఉన్నది.
బుమ్రా గైర్హాజరీతో ముంబయి ఇండియన్స్‌పై భారీగానే ప్రభావం చూపుతున్నది. ఇప్పటి వరకు ఆ జట్టు ఖాతా తెరువలేదు. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. సోమవారం కేకేఆర్‌తో సొంత మైదానంలోనే మ్యాచ్ ఆడనున్నది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బుమ్రా ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడుతాడన్నది ఇంకా స్పష్టత లేదు. పలు నివేదికలు ఏప్రిల్ మధ్యలో ముంబయి జట్టుతో చేరే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. బుమ్రా ఐపీఎల్ కెరీర్ 2013లో ముంబయి ఇండియన్స్‌తో మొదలైంది. అంతకు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో అరంగేట్రం చేశాడు. గత 12 సంవత్సరాల్లో బుమ్రా ముంబై తరపున 133 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 165 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన నలుగురు బౌలర్లలో ఒకడిగా నిలిచాడు.
Bumrah has started bowling in NCA. Don’t know when he will get the clearance but feeling better after watching this clip. pic.twitter.com/FTpnuVoJoW
— R A T N I S H (@LoyalSachinFan) March 30, 2025