Rishabh Pant | టీమిండియా స్టార్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్‌ను వెస్టిండీస్ మాజీ కెప్టెన్ దినేశ్ రామ్‌దిన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ప్రపంచంలోని టాప్ వికెట్ కీపర్లలో ఒకడని పేర్కొన్నారు. పంత్ ఐపీఎల్లో లక్నో తరఫున బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలవనున్నది. చాలాకాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన రిషబ్.. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. లక్నో యాజమాన్యం కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ మాట్లాడుతూ.. పంత్ బ్యాటింగ్, పరుగులు చేసే విధానం ప్రత్యేకమైందని చెప్పాడు. ఆస్ట్రేలియా నుంచి జోష్ ఇంగ్లిస్ సైతం చాంపియన్స్ ట్రోఫీలో రాణించాడని చెప్పారు.
వెస్టిండీస్ తరఫున 71 టెస్టులు, 139 వన్డేలు, 74 టీ20లు ఆడిన 40 రామ్‌దిన్.. గిల్‌క్రిస్ట్ వికెట్ కీపర్ల ప్రమాణాలను మార్చాడని పేర్కొన్నారు. గతంలో వికెట్ కీపర్స్ కేవలం.. కీపర్స్ మాత్రమేనని.. కానీ, క్రికెట్ ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిందని.. కీపర్ పాత్ర బ్యాట్స్‌మెన్‌గా విస్తరించిందని చెప్పాడు. ఇది ఆడమ్ గిల్‌క్రిస్ట్ వంటి ఆటగాళ్లతోనే మొదలైందని.. కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా రాణించాడని చెప్పారు. క్వింటన్ డి కాక్, బ్రెండన్ మెకల్లమ్, మహేంద్ర సింగ్ ధోని వంటి ప్లేయర్స్ వికెట్ కీపర్ రోల్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.