IPL 2025 | అశుతోష్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ తేడాతో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. ఢిల్లీ జట్టు 210 పరుగుల లక్ష్యాన్ని మరో మూడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. అశుతోష్ 31 బంతుల్లో 66 పరుగుల చేసి లక్నో ఢిల్లీని విజేతగా నిలిపాడు. లక్నో ఓటమి తర్వాత ఫ్రాంచైజీ ఓనర్ సంజయ్ గోయెంకా, హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్‌తో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైర్ అయ్యింది. ఓటమి తర్వాత పంత్‌కు సంజీవ్ గోయెంకా వార్నింగ్ ఇచ్చినట్లు పలువురు కామెంట్ చేశారు. గతంలో లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ పరిస్థితితే.. పంత్‌కు సైతం ఎదురవుతుందంటూ పలువురు పేర్కొంటున్నారు. గోయెంకా కారణంగా ఏ కెప్టెన్ అయినా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Sanjiv Goenka having a chat with Rishabh Pant.
Stupid Stupid Stupid pic.twitter.com/OcVwS7BJkX
— Abhinav Hariom Pandey 7 (@hariomAbhinav) March 24, 2025
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే.. రిషబ్ పంత్.. సంజీవ్ గోయెంకాకు ఏదో వివరిస్తున్నట్లు కనిపిస్తున్నది. వీడియో లో రిషబ్ పంత్ సీరియస్ నెస్ చూస్తుంటే సంజీవ్ గోయెంకా జట్టు ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా అనిపిస్తున్నది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ తర్వాత గోయెంకా మైదానంలోకి వచ్చి కెప్టెన్‌తో మాట్లాడడం కనిపించింది. ఆయన గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించారు. 2024 సీజన్లో అప్పటి లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో ప్రవర్తించిన తీరు విధితమే. ఆ తర్వాత లక్నో జట్టును వీడిన కేఎల్ రాహుల్ ఢిల్లీ జట్టులోకి చేరాడు. కెప్టెన్సీ అవకాశం వచ్చిన ఒప్పుకోలేదని.. సంజయ్ గోయెంకా వ్యవహారం భారీగానే ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు. 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత గోయెంకా మైదానంలోకి వచ్చి కేఎల్ రాహుల్‌ను అందరి ముందే తిట్టగా.. ఆ తర్వాత పెద్ద గొడవే జరిగింది.
Can anyone tell me where Sanjiv Goenka would be thinking of Rishabh Pant?? pic.twitter.com/xs0rMxNGYq
— Gurlabh Singh (@Gurlabh91001251) March 25, 2025
జెడ్డాలో జరిగిన వేలానికి ముందు లక్నో రాహుల్‌ను విడుదల చేసింది. లక్నో జట్టు రిషబ్ పంత్‌ను వేలం రూ.27కోట్లకు తీసుకుంది. ఐపీఎల్ హస్టరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. సోమవారం జరిగిన ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో లక్నో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. నికోలస్ పూరన్ 30 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో ఆరు బంతులు ఆడిన పంత్ డకౌట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 19.3 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి ఒక వికెట్ తేడాతో మ్యాచ్‌ను గెలిచింది. అశుతోష్ కాకుండా విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 39 పరుగులు చేయగా.. ఫాఫ్ డు ప్లెసిస్ 29 పరుగులు, కెప్టెన్ అక్షర్ పటేల్ 22 పరుగులు, ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగులు చేశారు.
Sanjiv Goenka having a chat with Rishabh Pant. pic.twitter.com/6H6WTCxoVc
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2025