IPL 2024 | పదిహేడో సీజన్లో కొత్త రూల్.. హిట్టర్ల దూకుడుకు కళ్లెం పడినట్టేనా..?
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం(Mini Auction) దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహించే వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈసారి లీగ్ మరింత...
IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ 17వ సీజన్ మినీ వేలం(Mini Auction) దుబాయ్ వేదికగా మరికొన్ని గంటల్లో మొదలవ్వనుంది. ఫేమస్ ఆక్షనీర్ మల్లికా సాగర్ (Mallika Sagar) నిర్వహించే వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు? అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈసారి లీగ్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. 16వ సీజన్లో ‘ఇంప్యాక్ట్ ప్లేయర్'(Impact Player) నిబంధనతో కొత్త ఒరవడికి నాంది పలికిన బీసీసీఐ తాజాగా బౌలర్లకు మేలు చేసే రూల్ తీసుకురానుంది.
అవును.. 17వ సీజన్లో ఒక ఓవర్లో ఫాస్ట్ బౌలర్లకు రెండు బౌన్సర్లు(Two Bouncers) సంధించేందుకు అనుమతిస్తారు. దాంతో, ఇక దంచుడే పరమావధిగా పెట్టుకున్న పవర్ హిట్లర్లకు కళ్లెం పడ్డట్టే. ఈ కొత్త నిబంధనను బీసీసీఐ దేశవాళీలో పరీక్షించింది. ఈ ఏడాది జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ(Syed Mushtaq Ali) ట్రోఫీలో ప్రతి ఓవర్లో రెండు బౌన్సర్లకు చాన్స్ ఇచ్చారు. ఈ నిబంధన బాగా వర్కవుట్ కావడంతో 17వ సీజన్ ఐపీఎల్‌లోనూ దీన్ని అమలు చేయనున్నారని టాక్.

పదహారో సీజన్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ రూల్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ సమయంలో పరిస్థితిని బట్టి ఇంప్యాక్ట్ ప్లేయర్‌ను ఆడించే వీలుండడం ఫ్రాంచైజీలకు బాగా కలిసొచ్చింది. దాంతో, బ్యాటింగ్‌లో త్వరగా వికెట్లు పడగానే స్పెషలిస్ట్ బ్యాటర్‌ను, బౌలింగ్‌లో తురుపుముక్కలను కెప్టెన్లు బ బరిలోకి దింపడం చూశాం. దానివల్ల ప్రతిభావంతులైన చాలామంది ఆల్రౌండర్లకు అవకాశాలు దక్కలేదు. పలు మ్యాచుల్లో వాళ్లు బెంచ్‌కే పరిమితమయ్యారు. మరి.. ఈసారి తీసుకొస్తున్న రెండు బౌన్సర్ల రూల్ బౌలర్లకు ఏమేర ఉపకరిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి
- Hyderabad | చైతన్యపురిలో డ్రగ్స్ సరఫరాచేస్తున్న ముగ్గురు అరెస్ట్.. పరారీలో గోవా డ్రగ్ పెడ్లర్
- Rishabh Pant | ఐపీఎల్ మినీ వేలంలో పంత్.. లీగ్ చరిత్రలో తొలి కెప్టెన్‌గా రికార్డు
- China Earthquake: చైనాలో భూకంపం.. ఊగిన బిల్డింగ్.. వీడియో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘స్పెషల్’ పెట్టకుండానే బాదుడు.. బస్ పాయింట్లలో కనిపించని రెగ్యులర్ బస్సులు!
Cyber Attack | సైబర్ ‘సెక్యూరిటీ’ ఏది?.. రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లపై యథేచ్ఛగా దాడులు
పాడి, కోళ్ల పరిశ్రమపై కరువు పంజా.. పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ
Stock Market Tips | స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? ముందుగా ఈ విషయాలు తెలుసుకోండి
Israel Elections | నెతన్యాహు భవితవ్యం ఏంటో.. రేపే ఇజ్రాయెల్ పార్లమెంట్ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

