న్యూఢిల్లీ: చైనాలో సోమవారం రాత్రి భూకంపం(China Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఆ తీవ్రత 6.2గా ఉంది. రెండు చోట్ల వచ్చిన భూకంపం వల్ల సుమారు 116 మంది మరణించారు. అయితే సీసీకెమెరాలకు ఆ భూకంపం చిక్కింది. ప్రస్తుతం ఆన్లైన్లో ఆ ఘటనకు చెందిన వీడియోలు దర్శనం ఇస్తున్నాయి. భూకంప ధాటికి బిల్డింగ్ ఊగిపోయింది. సీసీకెమెరాల్లో ఆ దృశ్యాలను చూడవచ్చు. గాన్సూ ప్రావిన్సులోని జియాన్, చెంగ్డూ నగరాల్లో భూకంపం నమోదు అయ్యింది.
ఆన్లైన్లో పోస్టు చేసిన వీడియోలో.. బిల్డింగ్ ఊగిన అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ధాటికి బిల్డింగ్‌పైకప్పు కూలింది. చాలా వరకు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. రాత్రి భూకంపం సంభవించడంతో.. స్థానికలు ప్రాణాల కోసం పరుగులు తీశారు.
భూకంప బాధితులను ఆదుకోవాలని దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఆదేశించారు.
#UPDATE: Video captured the moment when a 6.2-magnitude earthquake shook Linxia Hui Autonomous Prefecture in NW China’s Gansu on Monday night. The quake can be felt in major cities like Xi’an and Chengdu. pic.twitter.com/CrDeQBbnyO
— People’s Daily, China (@PDChina) December 18, 2023