RR vs GT | చెలరేగిన సంజూ శాంసన్, పరాగ్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..!
RR vs GT | వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్.. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ భారీ స్కోర్‌ను చేసింది. సంజూ శాంసన్, రియాన్ పరాగ్ ఇద్దరూ చెలరేగి జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. గుజరాత్‌కు పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు.
RR vs GT | గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సంజూ శాంసన్ రియాన్ పరాగ్ చెలరేగారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో చెలరేగి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు భారీ స్కోర్ అందించారు. గుజరాత్ ముందు 197 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 24 పరుగులు ) మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ నాలుగో ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (10 బంతుల్లో 8 పరుగులు) విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్( 38బంతుల్లో 68 పరుగులు ) , రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76 పరుగులు ) పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19వ ఓవర్లో బ్రేక్ పడింది. 18.4 ఓవర్‌కు మోహిత్ శర్మ వేసిన బంతికి పరాగ్ ఔటయ్యాడు. పరాగ్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మయిర్ ( 5 బంతుల్లో 13 పరుగులు ) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ ముందు 197 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

