RR vs GT | ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం..
RR vs GT | ఐపీఎల్ 2024లో భాగంగా జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించినప్పటికీ నిలడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించింది. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
RR vs GT | ఐపీఎల్ 2024లో రాజస్థాన్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించడంతో 7 వికెట్లను కోల్పోయిన గుజరాత్.. ఇన్నింగ్స్ చివరి వరకు నిలకడగా ఆడుతూ టార్గెట్‌ను చేధించింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 24 పరుగులు ) మొదటి మూడు ఓవర్లు చెలరేగి ఆడాడు. కానీ నాలుగో ఓవర్లో ఉమేశ్ యాదవ్ వేసిన బంతికి క్యాచ్ ఔటయ్యాడు. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (10 బంతుల్లో 8 పరుగులు) విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్( 38బంతుల్లో 68 పరుగులు ) , రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76 పరుగులు ) పరుగుల వేటలో దుమ్ముదులిపేశారు. ఇద్దరూ చెరో హాఫ్ సెంచరీతో జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. అయితే వీళ్ల భాగస్వామ్యానికి 19వ ఓవర్లో బ్రేక్ పడింది. 18.4 ఓవర్‌కు మోహిత్ శర్మ వేసిన బంతికి పరాగ్ ఔటయ్యాడు. పరాగ్ ఔటయిన తర్వాత క్రీజులోకి వచ్చిన హెట్మయిర్ ( 5 బంతుల్లో 13 పరుగులు ) కూడా ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్థాన్ 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.
రాజస్థాన్ నిర్దేశించిన 197 పరుగుల టార్గెట్‌ను చేధించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ దారుణంగా విఫలమయ్యింది. శుభ్‌మన్ గిల్ (72) ఒక్కడే చెలరేగి ఆడాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (35) కూడా రాణించాడు. వీళ్లు మినహా మిగిలిన బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ముఖ్యంగా గుజరాత్ బ్యాటర్లకు రాజస్థాన్ రాయల్స్ పేసర్ కుల్దీప్ సేన్ ముచ్చెమటలు పట్టించాడు. 10 బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి గుజరాత్‌ను కష్టాల్లో పడేశాడు. 9 ఓవర్లో రెండో బంతికి సాయి సుదర్శన్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత 11వ ఓవర్లో తొలి బంతికి మాథ్యూ, నాలుగో బంతికి అభినవ్ మనోహర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చాహల్ రెండు వికెట్లు, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
జట్టు క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్ నిలకడగా ఆడుతూ టార్గెట్‌కు దగ్గరగా తీసుకొచ్చారు. చివరి బంతికి రెండు పరుగులు చేస్తే విజయం దక్కే పరిస్థితి నెలకొంది. అలాంటి సమయంలో రషీద్ ఖాన్ ఫోర్ కొట్టి గుజరాత్‌ను గెలిపించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

