PBKS vs GT | టార్గెట్ చేధనలో బరిలోకి దిగిన గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 10వ ఓవర్లో మూడో బంతికి శుభ్‌మన్ గిల్ (35) ఔటయ్యాడు. రబాడా బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టేందుకు యత్నించి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతకుముందు నాలుగో ఓవర్లో నాలుగో బంతికి వృద్ధిమాన్ సాహా (13) ఔటయ్యాడు. 10 ఓవర్లకు గుజరాత్ స్కోర్ 68/2. ప్రస్తుతం క్రీజులో డేవిడ్ మిల్లర్ (1), సాయి సుదర్శన్ (17 ) ఉన్నారు.