LSG vs PBKS | ఈ సీజన్లో బోణీ కట్టాలన్న సంకల్పంతో ఉన్న పంజాబ్.. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో విజృంభించింది. క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా చెలరేగి ఆడారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసేలోపే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. నాలుగో ఓవర్లో కేఎల్ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు), ఆరో ఓవర్లో దేవ్‌దత్ పడిక్కల్ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్ (12 బంతుల్లో 19 పరుగులు ) కూడా రాణించలేకపోయాడు. తొమ్మిదో ఓవర్లో చాహర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. స్టాయినిస్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు).. ఓపెనర్ డికాక్(38 బంతుల్లో 54 పరుగులు)కు మంచి పార్టనర్షిప్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్ అందించారు. అయితే 13వ ఓవర్లో డికాక్ ఔటయిన తర్వాత పూరన్ జోరుకు బ్రేక్ పడింది. ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. డికాక్, పూరన్ పరుగుల వేటను కృనాల్ పాండ్యా ( 22 బంతుల్లో 43 పరుగులు) కొనసాగించాడు. కానీ అప్పటికే పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.