IPL 2023 | ముంబై ఇండియన్స్ vs పంజాబ్ కింగ్స్ అప్డేట్స్
IPL 2023 : ముంబై ఇండియన్స్ పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. హ్యాట్రిక్ విజయాలతో ముంబై జోరు మీదుంది. మరో వైపు పంజాబ్ ఓటమితో ఉంది. ఆఖరి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళురు చేతిలో కంగుతిన్న పంజాబ్ గెలుపుపై కన్నేసింది.
IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు టీ20 మజాను ఇచ్చింది. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ను 13 పరుగుల తేడాతో ఓడించింది. 215 టార్గెట్ ఛేదనలో రోహిత్ సేనను 201 రన్స్‌కే కట్టడి చేసింది. కామెరూన్ గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. దాంతో, ముంబై జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
🙌 https://t.co/81seKC2hCb pic.twitter.com/G5W5oUuhaD
— IndianPremierLeague (@IPL) April 22, 2023
అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవర్లో హడలెత్తించాడు. మూడో బంతికి తిలక్ వర్మ(3)ను బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టంప్ విరిగి అవతల పడింది. తర్వాత బంతికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన నీహల్ వధేరా(0) కూడా అచ్చం అలానే బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్(9) క్రీజులో ఉన్నాడు.
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(1) ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(44), కామెరూన్ గ్రీన్(67) దూకుడుగా ఆడారు. అయితే.. లివింగ్‌స్టోన్ రోహిత్‌ను ఔట్ చేయడం వీళ్ల 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్ యాదవ్(57), గ్రీన్ ధనాధన్ ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(3) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, లివింగ్‌స్టోన్ ఒక వికెట్ పడగొట్టారు.
-
22 Apr 2023 11:26 PM (IST)
ఉత్కంఠ పోరులో పంజాబ్ సూపర్ విక్టరీ... ముంబై జోరుకు బ్రేక్
ఐపీఎల్ 16వ సీజన్లో మరో ఉత్కంఠ పోరు అభిమానులకు టీ20 మజాను ఇచ్చింది. ఆఖరి ఓవర్లో అర్ష్‌దీప్ సింగ్ సంచలన బౌలింగ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ గెలుపొందింది. ముంబై ఇండియన్స్‌ను 13 పరుగుల తేడాతో ఓడించింది. 215 టార్గెట్ ఛేదనలో రోహిత్ సేనను 201 రన్స్‌కే కట్టడి చేసింది. కామెరూన్ గ్రీన్(67), సూర్యకుమార్ యాదవ్(57) హాఫ్ సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. దాంతో, ముంబై జైత్రయాత్రకు బ్రేక్ పడింది.
అర్ష్‌దీప్ సింగ్ 20వ ఓవర్లో హడలెత్తించాడు. మూడో బంతికి తిలక్ వర్మ(3)ను బౌల్డ్ చేశాడు. మిడిల్ స్టంప్ విరిగి అవతల పడింది. తర్వాత బంతికి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన నీహల్ వధేరా(0) కూడా అచ్చం అలానే బౌల్డ్ అయ్యాడు. టిమ్ డేవిడ్(9) క్రీజులో ఉన్నాడు.
భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్(1) ఔటయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(44), కామెరూన్ గ్రీన్(67) దూకుడుగా ఆడారు. అయితే.. లివింగ్‌స్టోన్ రోహిత్‌ను ఔట్ చేయడం వీళ్ల 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సూర్యకుమార్ యాదవ్(57), గ్రీన్ ధనాధన్ ఆడి స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ(3) విఫలమయ్యాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు వికెట్లు తీశాడు. నాథన్ ఎల్లిస్, లివింగ్‌స్టోన్ ఒక వికెట్ పడగొట్టారు.
-
22 Apr 2023 11:17 PM (IST)
తిలక్ వర్మ బౌల్డ్
అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్ మూడో బంతికి తిలక్ వర్మ(3) బౌల్డయ్యాడు. టిమ్ డేవిడ్(9) క్రీజులో ఉన్నాడు. ముంబై విజయానికి 3 బంతుల్లో 15 రన్స్ కావాలి.
-
22 Apr 2023 11:04 PM (IST)
సూర్య ఔట్
సూర్యకుమార్ యాదవ్(57) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, ముంబై నాలుగో వికెట్ పడింది. ముంబై విజయానికి 14 బంతుల్లో 33 రన్స్ కావాలి.
-
22 Apr 2023 10:56 PM (IST)
సూర్య ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
సూర్యకుమార్ యాదవ్(50) పాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో సూర్య యాభై రన్స్ బాదాడు.
-
22 Apr 2023 10:50 PM (IST)
ముంబై మూడో వికెట్ డౌన్
ముంబై మూడో వికెట్ పడింది. హాఫ్ సెంచరీ బాదిన కామెరూన్ గ్రీన్(67) ఔటయ్యాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టిన అతను మరో భారీ షాట్ ఆడాడు. సామ్ కరన్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. సూర్యకుమార్ యాదవ్(44) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 10:45 PM (IST)
గ్రీన్ హాఫ్ సెంచరీ
కామెరూన్ గ్రీన్(52) హాఫ్ సెంచరీ కొట్టాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.
-
22 Apr 2023 10:39 PM (IST)
14 ఓవర్లకు 132 రన్స్
సూర్యకుమార్ యాదవ్(39) దకూడు పెంచాడు. సామ్ కరన్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ బాదాడు. దాంతో, ముంబై స్కోర్ 130 దాటింది. కామెరూన్ గ్రీన్(45) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 10:29 PM (IST)
సూర్యకుమార్ హ్యాట్రిక్ ఫోర్లు
సూర్యకుమార్ యాదవ్(19) దంచుతున్నాడు. లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. దాంతో, ముంబై స్కోర్ వంద దాటింది. కామెరూన్ గ్రీన్(42) క్రీజులో ఉన్నాడు. 12ఓవర్లకు స్కోర్.. 109/2.
4⃣4⃣4⃣
SKY on the move 🔥🔥
Can he guide @mipaltan to victory tonight?#TATAIPL | #MIvPBKS pic.twitter.com/9mtymM39Tv
— IndianPremierLeague (@IPL) April 22, 2023
-
22 Apr 2023 10:20 PM (IST)
రోహిత్ ఔట్
లివింగ్‌స్టోన్ బిగ్ వికెట్ తీశాడు. డేంజరస్ రోహిత్ శర్మ(44)ను ఔట్ చేశాడు. దాంతో, 76 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కామెరూన్ గ్రీన్(36) క్రీజులో ఉన్నాడు.
Caught & Bowled 🙌@liaml4893 with the massive wicket of the #MI captain 👏👏#MI 88/2 after 10 overs.
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/jm3lElxwyw
— IndianPremierLeague (@IPL) April 22, 2023
-
22 Apr 2023 10:17 PM (IST)
రోహిత్ జోరు
రోహిత్ శర్మ(40) దంచి కొడుతున్నాడు. రాహుల్ చాహర్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టాడు. కామెరూన్ గ్రీన్(35) క్రీజులో ఉన్నారు. 9 ఓవర్లకు స్కోర్.. 79/1.
-
22 Apr 2023 10:03 PM (IST)
పవర్ ప్లేలో పరుగులు
పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. రోహిత్ శర్మ(26), కామెరూన్ గ్రీన్(24) క్రీజులో ఉన్నారు.
-
22 Apr 2023 09:58 PM (IST)
దంచుతున్న రోహిత్, గ్రీన్
సామ్ కరన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ(24) సిక్స్ కొట్టాడు. ఆఖరి బంతికి కామెరూన్ గ్రీన్(18) ఫోర్ బాదాడు. 5 ఓవర్లకు స్కోర్..46/1.
-
22 Apr 2023 09:49 PM (IST)
మొదటి సిక్స్
హర్‌ప్రీత్ బ్రార్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్(8) సిక్స్ కొట్టాడు. రోహిత్ శర్మ(9) క్రీజులో ఉన్నారు. 3 ఓవర్లకు స్కోర్..21/1.
-
22 Apr 2023 09:42 PM (IST)
ముంబైకి షాక్.. ఇషాన్ కిషన్ ఔట్
ముంబైకి షాక్.. ఓపెనర్ ఇషాన్ కిషన్(1) ఔటయ్యాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద మాథ్యూ షార్ట్ క్యాచ్ పట్టతండో అతను వెనుదిరిగాడు. రోహిత్ శర్మ(5), కామెరూన్ గ్రీన్ క్రీజులో ఉన్నారు.
-
22 Apr 2023 09:39 PM (IST)
రోహిత్ బౌండరీ
మాథ్యూ షార్ట్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ శర్మ(5) బౌండరీ కొట్టాడు. ఇషాన్ కిషన్ (1) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 09:23 PM (IST)
దంచికొట్టిన పంజాబ్ బ్యాటర్లు.. ముంబై టార్గెట్ 215
ముంబైలోని వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, పంజాబ్ 214 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ కరన్(55, 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41) చెలరేగి ఆడారు. బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 20వ ఓవర్లో జితేశ్ శర్మ(25) సిక్స్ కొట్టాడు. దాంతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి జితేశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హర్‌ప్రీత్ బ్రార్ ఫోర్ కొట్టాడు. దాంతో, పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
It's raining sixes in Mumbai 🌧️
Half-century comes up for @PunjabKingsIPL skipper @CurranSM 👏👏#PBKS nearing the 200-run mark now!
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/8ma8iLaP9v
— IndianPremierLeague (@IPL) April 22, 2023
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు మూడో ఓవర్లో షాక్ తగిలింది. ఫామ్‌లో ఉన్న మాథ్యూ షార్ట్(11) ఔటయ్యాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ తైడే ఇన్నింగ్స్ నిర్మించారు. దాంతో, పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అయితే.. అర్జున్ టెండూల్కర్ ఎల్బీగా ఔట్ చేసి45 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. పీయూష్ చావ్లా వేసిన 10వ ఓవర్లో లివింగ్‌స్టోన్(10) స్టంపౌట్, అథర్వ తైడే(29) బౌల్డ్ అయ్యారు. అయితే.. ఐదో వికెట్‌కు సామ్ కరన్(55), హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41) కీలకమైన 92 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (25) దంచాడు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, బెహ్రాన్‌డార్ఫ్, జోఫ్రా ఆర్చర్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
-
22 Apr 2023 09:18 PM (IST)
పంజాబ్ స్కోర్ 200
బెహ్రాన్‌డార్ఫ్ వేసిన 20వ ఓవర్లో జితేశ్ శర్మ(25) సిక్స్ కొట్టాడు. దాంతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి జితేశ్ బౌల్డయ్యాడు.
-
22 Apr 2023 09:15 PM (IST)
సామ్ కరన్ ఔట్
హాఫ్ సెంచరీ బాదిన సామ్ కరన్(55) ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, పంజాబ్ ఆరో వికెట్ కోల్పోయింది. జితేశ్ శర్మ(13) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 09:13 PM (IST)
సామ్ కరన్ ఫిఫ్టీ
సామ్ కరన్(51) హాఫ్ సెంచరీ బాదాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. 26 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో అతను 50 స్కోర్ చేశాడు.
-
22 Apr 2023 09:08 PM (IST)
ఐదో వికెట్ డౌన్
పంజాబ్ ఐదో వికెట్ పడింది. కామెరూన్ గ్రీన్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41) బౌల్డయ్యాడు. దాంతో, 92 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
-
22 Apr 2023 09:04 PM (IST)
దంచుతున్న పంజాబ్ బ్యాటర్లు
హర్‌ప్రీత్ సింగ్ భాటియా(41), సామ్ కరన్(33) దంచుతున్నారు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో హర్‌ప్రీత్ సిక్స్, సామ్ కరన్ బౌండరీ బాదారు. దాంతో, 13రన్స్ వచ్చాయి. 17 ఓవర్లకు స్కోర్..162/4.
-
22 Apr 2023 08:56 PM (IST)
టెండూల్కర్ ఓవర్లో 31 రన్స్
సామ్ కరన్(28) దంచుతున్నాడు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో సిక్స్, బౌండరీ బాదాడు. హర్‌ప్రీత్ సింగ్ భాటియా(34) ఒక ఫోర్, సిక్స్, ఫోర్ కొట్టాడు. దాంతో, 31రన్స్ వచ్చాయి. 16 ఓవర్లకు స్కోర్..149/4.
-
22 Apr 2023 08:35 PM (IST)
ఒకే ఓవర్లో రెండు వికెట్లు
పీయూష్ చావ్లా దెబ్బకు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. లివింగ్‌స్టోన్(10) స్టంపౌట్, అథర్వ తైడే(29) బౌల్డ్ అయ్యారు. దాంతో, పంజాబ్ 83 రన్స్ వద్ద 4 వికెట్లు కోల్పయి కష్టాల్లో పడింది.
Liam Livingstone ✅
Atharva Taide ✅Piyush Chawla on a roll 😎#PBKS 4⃣ down now inside the first ten!
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/XbOTRrxAO9
— IndianPremierLeague (@IPL) April 22, 2023
-
22 Apr 2023 08:18 PM (IST)
లివింగ్‌స్టోన్ భారీ సిక్స్
లివింగ్‌స్టోన్(10) దంచుతున్నాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో 101 మీటర్ల సిక్స్ బాదాడు. దాంతో, 10 రన్స్ వచ్చాయి అథర్వ తైడే(29) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 08:08 PM (IST)
రెండో వికెట్ డౌన్
పంజాబ్ రెండో వికెట్ పడింది. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (26) ఎల్బీగా ఔటయ్యాడు. అతను రివ్యూ తీసుకున్నా కూడా ఫలితం లేకపోయింది. 65 రన్స్ వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. అథర్వ తైడే(24) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 08:01 PM (IST)
పవర్ ప్లేలో 58 రన్స్
పవర్ ప్లేలో పంజాబ్ బ్యాటర్లు దంచారు. పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (25), అథర్వ తైడే (19) చెరొక ఫోర్ కొట్టారు. ఐదు ఓవర్లకు స్కోర్.. 58/1.
End of powerplay ✅
Prabhsimran Singh & Atharva Taide on the charge for @PunjabKingsIPL as they move to 58/1 at the end of six overs 👌👌
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/sjubMzTYns
— IndianPremierLeague (@IPL) April 22, 2023
-
22 Apr 2023 07:56 PM (IST)
తైడే దూకుడు
అథర్వ తైడే (11) స్పీడ్ పెంచాడు. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్(20) క్రీజులో ఉన్నాడు. ఐదు ఓవర్లకు స్కోర్..46/1.
-
22 Apr 2023 07:51 PM (IST)
ప్రభ్సిమ్రాన్ రెండు సిక్స్‌లు
ఓపెనర్ ప్రభ్సిమ్రాన్(19) దూకుడు పెంచాడు. బెహ్రాన్‌డార్ఫ్ వేసిన మూడో ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. అథర్వ తైడే (3) క్రీజులో ఉన్నాడు. నాలుగు ఓవర్లకు స్కోర్.. 36/1.
-
22 Apr 2023 07:44 PM (IST)
తొలి వికెట్ తీసిన గ్రీన్
కామెరూన్ గ్రీన్ తొలి వికెట్ తీశాడు. ఫామ్‌లో ఉన్న మాథ్యూ షార్ట్(11)ను ఔట్ చేశాడు. రెండో బంతికి ఫోర్ కొట్టిన షార్ట్ మూడో బంతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రభ్సిమ్రాన్ సింగ్(5) క్రీజులో ఉన్నాడు.
-
22 Apr 2023 07:36 PM (IST)
తొలి ఓవర్లో 5 రన్స్
అర్జున్ టెండూల్కర్ వేసిన తొలి ఓవర్లో5 రన్స్ వచ్చాయి. ప్రభ్సిమ్రాన్ సింగ్(1), మాథ్యూ షార్ట్(2) క్రీజులో ఉన్నారు.
-
22 Apr 2023 07:05 PM (IST)
టాస్ గెలిచిన ముంబై
ముంబై ఇండియన్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దాంతో, పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

