IPL 2023 : టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్(37), సర్ఫరాజ్ ఖాన్ (30), అక్షర్ పటేల్(36) మాత్రమే రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌కు ఒక వికెట్ దక్కింది.
ఓపెనర్ పృథ్వీ షా (7)ను ఔట్ చేసిన షమీ ఢిల్లీని ఆదిలోనే దెబ్బకొట్టాడు. గత మ్యాచ్‌లో డకౌట్ అయిన మిచెల్ మార్ష్(4)ను షమీ బౌల్డ్ చేశాడు. దాంతో 37 రన్స్ వద్ద ఢిల్లీ రెండో వికెట్ పడింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్(37), సర్ఫరాజ్ ఖాన్ (30) ఢిల్లీ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. అయితే.. అల్జారీ జోసెఫ్ ఒకే ఓవర్లో వార్నర్, రిలే రస్సోను ఔట్ చేసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. ఆ తర్వాత అభిషేక్ పొరెల్ (20) ధాటిగా ఆడడంతో ఢిల్లీ స్కోర్ వంద దాటింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టన అభిషేక్ అతడికే వికెట్ సమర్పించుకున్నాడు. చివర్లో అక్షర్ పటేల్(26), సర్ఫరాజ్ ఖాన్ (30) ధాటిగా ఆడి స్కోర్‌బోర్డు వేగం పెంచారు.