CSK vs pbks | ఐపీఎల్లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 134 పరుగులు మాత్రమే చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే బ్యాట్స్‌మెన్.. తొలి నుంచే తడబడ్డారు. డుప్లెసిస్ ( 76 ) ఒక్కడే రాణించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన గైక్వాడ్ ( 12 ) పరుగులకే క్యాచ్ ఔట్ అవ్వగా.. మొయిన్ డకౌట్ అయ్యాడు. రాబిన్ ఉతప్ప ( 2), అంబటి రాయుడు (4), ధోనీ (12) పరుగులు చేయడంలో విఫలమయ్యారు. జడేజా (15) కూడా ఆకట్టుకోలేకపోయారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి చెన్నై 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 135 పరుగులు చేయాల్సి ఉంది.