IOC : పదహారేళ్ల తర్వాత జరగనున్న ఒలింపిక్స్ 2036కు ఆతిథ్యం కోసం నిరీక్షిస్తున్న భారత్కు గట్టి పోటీ ఎదురువుతోంది. విశ్వ క్రీడలను తమ ప్రాంతంలో జరిపేందుకు ఏకంగా ఏడు దేశాలు పోటీపడుతున్నాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) వెల్లడించింది. భారత్, జర్మనీ, హంగేరి, ఖతార్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, దక్షిణాఫ్రికా, తుర్కియే.. ఈ ఏడు విశ్వక్రీడల నిర్వహణ హక్కుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాయని మంగళవారం ఐఓసీ పేర్కొంది.
భారత దేశంలో ఒలింపిక్స్ పోటీలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. 2024లోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ భారత్ ప్రతిపాదన పెట్టింది. కానీ, కిర్స్టీ కొవెంట్రీ(జింబాబ్వే) ఐఓసీ అధ్యక్షురాలు అయ్యాక సమీక్షకు ఆదేశించింది. ఇప్పటికే 2028, 2031 వేదికలుగా లాస్ ఏంజెల్స్, బ్రిస్బేన్ ఖరారు కాగా.. 20236 ఎడిషన్ హక్కుల కోసం మన అధికారులు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఐఓసీ కీలక ప్రకటన చేసింది.
The IOC sets out the next phase of the process for selecting the host of the 2036 Olympic Games. 🏅
More details ⬇️
🔗https://t.co/2lGaSkYaUP https://t.co/pICvU1AYnz
— IOC MEDIA (@iocmedia) October 6, 2026
విశ్వక్రీడల నిర్వహణ కోసం పోటీలో నిలిచిన ఏడు దేశాల పేర్లను వెల్లడించిన ఐఓసీ.. ఆతిథ్యాన్ని కట్టబెట్టేందుకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నవంబర్లోనే ఈ ఏడు దేశాల ప్రతినిధులు తమ ప్రాజెక్ట్ను ఐఓసీ ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు సమర్పించాలని స్పష్టం చేసింది. తీవ్రమైన పోటీ దృష్ట్యా.. ఎవరి ప్రాజెక్ట్ బాగుంటే వారికే ఆమోదముద్ర వేయాలనుకుంటోంది ఒలింపిక్ కమిటీ.
1. ఒలింపిక్స్ 2036 ఆతిథ్యం కోసం బిడ్డింగ్ వేసేందుకు తొలి తుది గడువును అక్టోబర్ 31గా నిర్ణయించింది ఐఓసీ. ఆసక్తిగల దేశాలు ఈ తేదీలోపే తమ ప్రతిపాదనను ఐఓసీకి పంపించాలి.
2. ప్రస్తుతానికి బరిలో ఉన్న ఏడు దేశాలతో చర్చలు జరుపుతోంది ఐఓసీ. నవంబర్లో ఈ దేశాల ప్రతినిధులు ఫ్యూచర్ హోస్ట్ కమిషన్ ముందు వర్చువల్గా ప్రజెంటేషన్ ఇవ్వాలని కోరింది.
🏅 India, Qatar and South Africa were confirmed on Tuesday among the seven countries interested in hosting the 2036 Summer Olympics.
➡️ https://t.co/2Q5T4NZHO0 https://t.co/qm2IEukZtE— AFP News Agency (@AFP) October 6, 2026
3. నవంబర్ అనంతరం ఐఓసీ ఆసక్తిగల దేశాల దరఖాస్తులను పరిశీలించనుంది. వచ్చే ఏడాది మార్చిలో ఎగ్జిక్యూటివ్ బోర్డు వ్యూహాత్మక చర్చలు జరుపనుంది. ప్రాథమిక దశ పరిశీలన పూర్తయ్యాక.. బిడ్డింగ్ వేసిన దేశాల ప్రాజెక్టును సునిశితంగా గమనించనుంది ఐఓసీ.
4. 2028 డిసెంబర్లో ఒలింపిక్స్ అతిథ్యానికి అనువైన దేశాలతో ఐఓసీ చర్చించనుంది. 2029 మధ్యలో 2036 ఒలింపిక్స్ వేదికను ఐఓసీ సభ్యులు ఖరారు చేయనున్నారు.