Paris Olympics | ఢిల్లీ: మరో 8 రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడానికి గాను భారత్ 117 మంది క్రీడాకారులను పారిస్కు పంపింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది.
117 మంది అథ్లెట్లతో పాటు వారికి 140 మంది సహాయక బృందం పారిస్ వెళ్లనున్నారు. వీరిలో 72 మంది ఖర్చులను కేంద్ర క్రీడా శాఖ భరించనుంది. అథ్లెట్లలో షాట్ పుటర్ అభా ఖతువా పేరు లేదు. అయితే ఆమెను ఎందుకు పక్కనబెట్టిన విషయాన్ని మాత్రం ఐవోఏ వెల్లడించలేదు.
క్రీడాకారుల జాబితాలో అథ్లెటిక్స్ నుంచి 29 మంది ఉండగా షూటింగ్ (21), హాకీ (19), టేబుల్ టెన్నిస్ (8), బ్యాడ్మింటన్ (7), రెజ్లింగ్ (6), ఆర్చరీ (6), బాక్సింగ్ (6), గోల్ఫ్ (4), టెన్నిస్ (3), స్విమ్మింగ్ (2), సెయిలింగ్ (2), ఈక్వెస్ట్రియన్, జూడో, రోయింగ్, వెయిట్ లిఫ్టింగ్ నుంచి తలా ఒక్కరు ఉన్నారు.